డ్రగ్స్ కేసు: 27లోగా బిగ్ బాస్ నుంచి ముమైత్ ఖాన్ ఔట్?
డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కోనున్న ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్‌కు బిగ్ బాస్ నుంచి ఉద్వాసన తప్పేట్లు లేదు. డ్రగ్స్ కేసులో ఆమె ఈ నెల 27వ తేదీన ఎక్సైజ్ సిట్ అధికారుల విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కోనున్న ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్‌కు బిగ్ బాస్ నుంచి ఉద్వాసన తప్పేట్లు లేదు. డ్రగ్స్ కేసులో ఆమె ఈ నెల 27వ తేదీన ఎక్సైజ్ సిట్ అధికారుల విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.
డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ముమైత్ ఖాన్‌కు సిట్ అధికారుల నుంచి నోటీసులు అందినట్లు సమాచారం.
ఆమె లోనావాలాలో జరుగుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటకు వస్తారని, విచారణ కోసం హైదరాబాద్ వస్తారని సమాచారం.

విచారణకు వస్తారు...
తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ విచారణకు తప్పకుండా వస్తారని సిట్ అధికారులు భావస్తున్నారు. ఎన్‌డిపిఎస్ చట్టంలోని 67 సెక్షన్ ప్రకారం ఇచ్చిన నోటీసుల మేరకు ముమైత్ ఖాన్ సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు.

అధి ఆమె చాయిస్....
పురుష సెలిబ్రిటీల మాదిరిగా ముమైత్ ఖాన్ సిట్ హైదరాబాదులోని నాంపల్లిలో గల ఆబ్కారీ భవనంలోని కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. ముమైత్ ఖాన్ విచారణను ఎదుర్కోవడానికి తనకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. సిట్ అధికారులు అక్కడికే వెళ్లి ఆమెను ప్రశ్నిస్తారు.
Recommended Video


అయితే హైదరాబాదులోనే....
సిట్ అధికారుల విచారణను ఎదుర్కోవడానికి ముమైత్ ఖాన్ హైదరాబాదులోని ప్రదేశాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లోని ప్రదేశాలను ఎంపిక చేసుకోవడానికి వీలు లేదు. ఈ నెల 27వ తేదీకి ముందే ఆమె హైదరాబాద్‌లో ఉంటారని భావిస్తున్నారు.

ఆర్గనైజర్స్‌ను సంప్రదించి....
డ్రగ్స్ కేసులో తొలుత నోటీసులు ఇవ్వడానికి ముమైత్ ఖాన్ చిరునామా అధికారులకు లభించలేదు. ఆ తర్వాత అదికారులు తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించి, నోటీసుకు సంబంధించిన విషయాలను చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications