ఇవాంకా పర్యటన: ఆద్యంతం రహస్యంగా, ఆహ్వానానికీ రావద్దని సూచన, ఎందుకిలా?
ఇవాంకా హైదరాబాద్ పర్యటన యావత్తూ అత్యంత రహస్యంగా జరగనుంది. ఆమె ఎప్పుడు హైదరాబాద్ చేరుకుంటారు? ఎక్కడ బస చేస్తారు? భాగ్యనగరంలో ఏయే ప్రాంతాలను ఇవాంకా సందర్శిస్తారు? ఇలాంటివన్నీ దేవరహస్యమే!
Recommended Video

హైదరాబాద్: భాగ్యనగరంలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్(జీఈఎస్)లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇవాంకా హైదరాబాద్ పర్యటన యావత్తూ అత్యంత రహస్యంగా జరగనుంది. ఆమె ఎప్పుడు హైదరాబాద్ చేరుకుంటారు? ఎక్కడ బస చేస్తారు? భాగ్యనగరంలో ఏయే ప్రాంతాలను ఇవాంకా సందర్శిస్తారు? ఇలాంటివన్నీ దేవరహస్యమే!

ఆద్యంతం రహస్యంగా...
హైదరాబాదుకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్ పర్యటనను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు అమెరికా అధికారులు. ఆమె అధికారిక పర్యటనకు సంబంధించిన ఏ వివరాలు బయటకు పొక్కనీయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్ చేరుకుంటారు? ఎక్కడ బస చేస్తారు? భాగ్యనగరంలో ఏయే ప్రాంతాలను ఇవాంకా సందర్శిస్తారు? ఇలాంటివన్నీ బయటికి తెలియనివ్వడం లేదు. ఇప్పటి వరకూ ఆమె పర్యటనపై వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనంటూ వారు కొట్టిపారేస్తున్నారు.

ఆహ్వానానికి కూడా రావద్దు...
శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాంకా అడుగుపెట్టే సమయంలో అధికారిక హోదాలో ఆమెను ఆహ్వానించేందుకు ఎవరూ రావద్దని కూడా అమెరికా భద్రతాధికారులు సమాచారం అందించారు. దీంతో ఆమె ఎన్నిగంటలకు హైదరాబాదులో ల్యాండ్ అవుతారు? ఎక్కడ బస చేస్తారు? ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? వంటి వివరాలన్నీ రహస్యంగా మిగిలిపోయాయి. అయితే ఇవాంకా పర్యటనను మరీ ఇంత రహస్యంగా ఉంచడానికి కేవలం భద్రతా కారణాలేనా? మరేమైనా కారణాలున్నాయా? అన్నది అంతుబట్టడం లేదు.

ముస్తాబవుతున్న భాగ్యనగరం...
మరోవైపు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ రానున్న నేపథ్యంలో భాగ్యనగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ సదస్సు ఏటా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో జరుగుతూనే ఉంటుంది. అయితే దీనికి ఓ దక్షిణాసియా దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

ధోనీ, దీపికాలకు ఆహ్వానం.. కానీ..
ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్ హాజరుకానుండగా క్రీడారంగం నుంచి టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, బాలీవుడ్ ప్రముఖ నటి దీపిక పదుకునే సహా పలువురిని ఆహ్వానించారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ సదస్సుకు హాజరు కాలేకపోతున్నట్టు ధోనీ ఇప్పటికే సమాచారం అందించాడు. ‘హాలీవుడ్ టు నాలీవుడ్ టు బాలీవుడ్' అనే అంశంపై దీపిక ప్రసంగించాల్సి ఉండగా ఆమె కూడా హాజరుకాలేనని సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇక క్రీడారంగం నుంచి ఆహ్వానం అందుకున్న వారిలో సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్ తదితరులు సదస్సుకు హాజరుకానున్నారు.

రోడ్ టు జీఈఎస్ పేరుతో...
గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్ కు సన్నాహకంగా 24 నుంచే రోడ్ టు జీఈఎస్ పేరిట తెలంగాణ ప్రభుత్వం పలు ఆకర్షణీయ కార్యక్రమాలు నిర్వహిస్తోన్నట్లు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణలో స్టార్టప్‌ల పరిస్థితి ఎలా ఉంది. స్టార్టప్‌లకు ప్రోత్సాహకంగా ఎలాంటి కార్యక్రమలు నిర్వహిస్తున్నారు? తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎలాంటి ఎగ్జిబిషన్లు ఉండవని, పూర్తిగా వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య న చర్చలు, సదస్సు కీలకాంశంపై గోష్ఠులకే మూడు రోజుల కార్యక్రమాలు పరిమితం అవుతాయని వివరించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications