హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు ఇవాంకా ట్రంప్: కలవరపెడుతున్న దోమలు, గ్రేటర్ 'ఆపరేషన్'

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఆమె ప్రయాణించే రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆమె రాక నేపథ్యంలో బిచ్చగాళ్లు కనిపించకుండా చేస్తున్నారు. రోడ్లు తళతళ మెరుస్తున్నాయి.

చదవండి: హైదరాబాద్‌కు ఇవాంకా, సామాన్యులకు చుక్కలు: 'ఇళ్ల నుంచి బయటకు రావొద్దు', టెక్కీలకూ

చదవండి: యాడంగ వస్తందో.. యానంగ పోతదో: హోంమంత్రి నాయిని, ఇవాంకా టూర్‌ షెడ్యూల్లో మార్పు!?

కలవరపెడుతున్న దోమలు

కలవరపెడుతున్న దోమలు

అంతేకాదు, విందు ప్రాంగణంలో దోమలు ఉండకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే బల్దియా దోమలపై సమరం ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన దోమల నివారణ చర్యలు చేపట్టింది. ఇవాంకతో పాటు గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే వారికి గోల్కొండ కోటలో విందు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

యాంటీ లార్వా ఆపరేషన్

యాంటీ లార్వా ఆపరేషన్

ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడ దోమలు ఉన్నాయి. సాయంత్రం దోమలు కలవరపెడుతున్నాయి. కోటలో విందుకు మరో ఎనిమిది రోజులు ఉంది. ఈ నేపథ్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు. కోటలోని దోమలు ఉండే ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

పరిసరాల్లోను చర్యలు

పరిసరాల్లోను చర్యలు

గోల్కొండ కోటలోనే కాదు, పరిసర ప్రాంతాల్లోని లంగర్ హౌస్ హుడా పార్కు, చెరువులు తదితర ప్రాంతాల్లో దోమలు లేకుండా చూస్తున్నారు. నీటిలోని గుర్రపు డెక్కను తొలగిస్తూ మలేరియా లారీసైడల్ ఆయిల్‌ను స్ప్రే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఆపరేషన్ ఫలితం వల్ల దోమలు తగ్గుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ చర్యల వల్ల దోమలు తగ్గుతున్నాయి.

అద్భుత రుచులు

అద్భుత రుచులు

కాగా, 29న ఇచ్చే విందు అద్భుతంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ బాధ్యతను మంత్రి కేటీఆర్ తనపై వేసుకున్నారు. ఇవాంకాకు ఇచ్చే విందులో హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే పతక్ కా గోస్ట్, షీర్ కుర్మా, డబుల్ కమిటీ, బగారే బైగన్, దమ్ కీ బిర్యానీ, కుర్బానీ మీఠా, ఇరానీ చాయ్, రవ్వలడ్డు తదితరాలతో పాటు ఇండియన్, చైనీస్, ప్రెంచ్, గ్రీకు, ఇటాలియన్, కరేబియన్ వంటకాలు తయారు చేయించనున్నారు.

ప్రధాని కంటే ఇవాంకాకే భద్రత ఎక్కువ!

ప్రధాని కంటే ఇవాంకాకే భద్రత ఎక్కువ!

ఇవాంకా పర్యటన నేపథ్యంలో మన పోలీసు అధికారులు, అమెరికా అధికారులు మంగళవారం భేటీ అయ్యారు. అమెరికన్ భద్రతాధికారులు సమావేశమై పలు సూచనలు చేశారు. వెస్టిన్ హోటల్, హెచ్ఐసీసీ, ఫలక్ నుమా ప్యాలెస్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇవాంకాకు మూడంచెల భద్రతను ఇవ్వనున్నారు. విధంగా ప్రధాని మోడీ కంటే ఇవాంకాకే ఎక్కువ భద్రత ఉండనుందని అంటున్నారు.

చదవండి: ఇవాంకా అందాల్ని చూడాలనుకుంటున్నా: సన్నీలియోన్‌తో పోల్చిన వర్మ, సిటీలో ఇవాంకా కళ

చదవండి: అంతా అబద్దం: ఇవాంకా 'ఖర్చు'పై కేటీఆర్, 'ఖాకీ దుస్తుల్లో ఒక్కరు మించి వద్దు'

చదవండి: ఇవాంకా హైదరాబాద్‌లో ఇలా, 500 కెమెరాలు: సదస్సుతో స్టార్టప్‌లకు 'మిలియన్ డాలర్ల్' ఛాన్స్

English summary
The threat perception to US President Donald Trump's daughter Ivanka Trump, who is visiting India this month, is very high and the US government has requested the authorities not to disclose even the slightest piece of information about her schedule, a senior official said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X