వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా కోసం నోరూరించే వంటకాలు... అంతా కేటీఆర్ కనుసన్నల్లో...

తొలిసారిగా భారత్‌లో అడుగుపెడుతున్న ఇవాంకా ట్రంప్ కు మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తొలిసారిగా భారత్‌లో అడుగుపెడుతున్న ఇవాంకా ట్రంప్ కు మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఇవాంకా, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు హైదరాబాద్ వంటకాలను రుచి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

దటీజ్ ఇవాంకా! మాటల్లో నేర్పరితనం.. నిండైన ఆత్మవిశ్వాసం, ట్రంప్‌కు కూతురే పెద్ద రక్ష!దటీజ్ ఇవాంకా! మాటల్లో నేర్పరితనం.. నిండైన ఆత్మవిశ్వాసం, ట్రంప్‌కు కూతురే పెద్ద రక్ష!

ఇవాంకా టూర్: డేగ కళ్ల నిఘా, సదస్సు ప్రాంగణం, బస అన్నీ.. యూఎస్ సెక్యూరిటీ చేతుల్లోకి...ఇవాంకా టూర్: డేగ కళ్ల నిఘా, సదస్సు ప్రాంగణం, బస అన్నీ.. యూఎస్ సెక్యూరిటీ చేతుల్లోకి...

రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్‌లోకి...రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్‌లోకి...

నవంబర్ 29న గోల్కొండ కోట వేదికగా ఇవాంకా ట్రంప్‌కు సీఏం కేసీఆర్ డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ సదస్సు పూర్తి బాధ్యతలను మంత్రి కేటీఆర్ తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.

Ivanka Trump to taste these Hyderabadi dishes in KCR’s dinner at Golconda Fort

ఈ డిన్నర్‌లో హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబించే పత్తర్ కా ఘోష్, షీర్ కుర్మా, డబుల్ కా మిఠా వంటి పలు ప్రత్యేకమైన వంటకాలను వడ్డించనున్నారు. నగరంలోని పలువురు నైపుణ్యమున్న చెఫ్‌లకు ఆయా వంటకాలు తయారు చేసే బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్‌లో ప్రత్యేకమైన బగారే బైగాన్, దమ్ కి బిర్యానీ, కుబానీ కా మిఠా, ఇరానీ చాయ్, పలు కూరలు, వంటకాలను తయారు చేయాలని నిర్వాహకులు సమాచారాన్ని అందించారు.

డబుల్ కా మిఠా, కుంబాని కా మిఠా, షీర్ కుర్మా, రవ్వ లడ్డూ వంటి హైదరాబాద్‌లో లభించే ప్రత్యేక తీపి వంటికాలను విందులో వడ్డించనున్నారు. వీటితోపాటుగా ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్ మరియు కరేబియన్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయనున్నారు.

భాగ్యనగరం వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్‌లో అమెరికా తరపున ఇవాంకా ప్రాతినిథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె భద్రత కోసం హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

ఆమె కాన్వాయ్‌లో కూడా అమెరికా నుంచి వచ్చే వాహనాలే ఉండబోతున్నాయట. ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సుకు ఇవాంకాతోపాటు దేశ విదేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు రాబోతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది.

English summary
CM of Telangana State, KCR is hosting a dinner on 29th November at Golconda Fort in honour of Ms. Ivanka Trump and other delegates of GES. In this dinner, dishes representing the composite culture of Hyderabad will be presented which include “Pathar ka Gosht”, “Sheer Khurma”, “Double ka Mitha” etc. The organizers of the dinner have commissioned the noted chefs of Hyderabad so that they could prepare special Hyderabadi dishes. The menu also includes vegetable curry, “Baghare Baigan”, “Dum ki Biryani”, “Khubani ka Mitha” and Irani tea. It may be mentioned that in sweet dishes, “Double ka Mitha”, “Khubani ka Mitha”, “Sheer Khurma” and “Rawa Laddu” are the famous ones in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X