కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయం ఇప్పుడు చంద్రబాబుకు.. కొడాలి నానీ పైనా; జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై తెలంగాణ ప్రాంత నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పైన కూడా అనుచితంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మొదలైన రాజకీయ దుమారంలో పలువురు రాజకీయ నాయకులు చంద్రబాబుకు మద్దతు ఇచ్చి వైసిపి నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాజకీయాలు వ్యక్తిగత దూషణల దాకా వెళ్లొద్దు అన్న జగ్గా రెడ్డి

రాజకీయాలు వ్యక్తిగత దూషణల దాకా వెళ్లొద్దు అన్న జగ్గా రెడ్డి


ఇక తాజాగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించే కాంగ్రెస్ నాయకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏపీలో తాజా రాజకీయ పరిణామాల పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రశాంతంగా జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీతో తనకు అనుబంధం ఉంది కాబట్టే తాను మాట్లాడుతున్నానని పేర్కొన్న జగ్గారెడ్డి, రాజకీయాలు రాజకీయాలు వరకే పరిమితం కావాలని వ్యక్తిగత దూషణలు దాకా వెళ్లకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో కొడాలి నాని ఎక్కడ ఉన్నారు?

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో కొడాలి నాని ఎక్కడ ఉన్నారు?

ఏపీ మంత్రి కొడాలి నాని తన మాటలను మార్చుకుంటే బెటర్ అంటూ జగ్గారెడ్డి సూచించారు. పగలు, ప్రతీకారాల వరకు వెళ్లొద్దని హితవు పలికారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో కొడాలి నాని ఎక్కడ ఉన్నాడో చెప్పాలని జగ్గా రెడ్డి ప్రశ్నించారు. కౌరవసభలో ద్రౌపది కి జరిగిన అన్యాయం ఇప్పుడు చంద్రబాబుకు జరిగిందని జగ్గా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక ఇదే సమయంలో పగలు, ప్రతీకారాలు పెంచుకుంటే పెరుగుతూ పోతాయని, ప్రతి ఒక్కరికి లూప్ హోల్స్ ఉంటాయని, అంతమాత్రాన వాటిని బహిరంగ చర్చకు పెట్టడం అవసరం లేదని పేర్కొన్నారు.

కొడాలి నాని మాటలు మార్చుకుంటే మంచిది; రోజాపై నాడు చేసింది తప్పే

కొడాలి నాని మాటలు మార్చుకుంటే మంచిది; రోజాపై నాడు చేసింది తప్పే

తెలుగుదేశం పార్టీ నేతలు మీ కుటుంబాన్ని అంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నించిన జగ్గారెడ్డి వైసీపీ నేతలు చేసింది తప్పేనని తేల్చేశారు. ఏపీ తో తనకు కూడా అనుబంధం ఉందని పేర్కొన్న జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కి ఎందుకు ఏపీ రాజకీయం అని అనుకునేరు అంటూ పేర్కొన్నారు. తానిప్పుడు మర్యాదగా మాట్లాడుతున్నానని, తన వ్యాఖ్యలపై తేడాగా స్పందిస్తే, అందరి గురించి తనకు తెలుసని హెచ్చరించారు. ఏది ఏమైనా కొడాలి నాని ని టార్గెట్ చేసి కొడాలి నాని మాటలు మార్చుకుంటే మంచిదంటూ చురకలు అంటించారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యే రోజా పై చంద్రబాబు హయాంలో వ్యక్తిగత దూషణలకు దిగితే అది తప్పేనని పేర్కొన్నారు. బిజెపి కూడా వ్యక్తిగత దూషణల రాజకీయం మొదలు పెట్టిందని జగ్గారెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ లో అలాంటి కల్చర్ లేదు

కాంగ్రెస్ లో అలాంటి కల్చర్ లేదు

కాంగ్రెస్ పార్టీలో మాత్రం అటువంటి కల్చర్ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తమను ఎవరైనా ఏమైనా అంటే స్పందిస్తామే తప్ప వ్యక్తిగత దూషణలకు తాము దిగేది లేదని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమను సన్నాసులు అంటే, అప్పుడే మేం కెసిఆర్ సన్నాసి అంటాం తప్ప, విడిగా ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర రాజకీయం ప్రశాంతంగా జరిగేలా చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యక్తిగత దూషణలకు దిగటం రాజకీయాలకు మంచిది కాదని ఆయన వైసీపీ నేతలకు హితవు పలికారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+