11 ఏళ్ల క్రితం ఆమె చనిపోయిందనుకుని అంత్యక్రియలు... ఇన్నేళ్లకు మళ్లీ తిరిగొచ్చిన ఆ మహిళ...
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల క్రితం చనిపోయిందని భావించిన ఓ మహిళ మళ్లీ తిరిగొచ్చింది. అప్పట్లో ఆమె చనిపోయిందని భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఆమెది కాదని తేలిపోయింది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత ఆ మహిళ తిరిగి కుటుంబ సభ్యులను చేరింది.
వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో నర్సయ్య,లక్ష్మి అనే దంపతులు చాలాకాలంగా నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. భర్త నర్సయ్య బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టాడు. లక్ష్మి గ్రామంలోనే కూలీ పనులకు వెళ్తోంది. ఇదే క్రమంలో 11 ఏళ్ల క్రితం ముగ్గురు కుమార్తెల్లో ఒకరైన లక్ష్మి తప్పిపోయింది. చాలారోజులు ఆమె కోసం వెతికినా ఆచూకీ తెలియలేదు.

ఆమె అదృశ్యమైన రెండేళ్లకు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ అటవీప్రాంతంలో పోలీసులకు ఓ మృతదేహం లభ్యమైంది. లక్ష్మి కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడికి పిలిపించగా... అది ఆమె మృతదేహమేనని గుర్తించారు. స్వగ్రామంలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. 11 ఏళ్లుగా ఆమె చనిపోయిందనే భావనలోనే ఉన్నారు. కానీ ఇన్నేళ్లకు వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
నిజానికి చనిపోయిందనుకున్న లక్ష్మి ఇంకా బతికే ఉంది. ఎలా చేరిందో తెలియదు గానీ ఆమె తమిళనాడులోని పెరంబలూర్ ప్రాంతానికి చేరింది. అక్కడి ఓ స్వచ్చంద సంస్థ ఆమెను చేరదీసింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారే ఉచితంగా వైద్యం అందించారు. ఇటీవల లక్ష్మి కోలుకోగా ఆమె కుటుంబం వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మి చెప్పిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ గ్రామానికి ఆమెను తీసుకొచ్చారు. కుటుంబం సభ్యులకు ఆమెను అప్పగించి వెళ్లిపోయారు.
సోమవారం(ఆగస్టు 23) రాత్రి లక్ష్మి వారి కుటుంబ సభ్యులను చేరింది. 11 ఏళ్లుగా తాము చనిపోయిందని భావిస్తున్న లక్ష్మి... మళ్లీ తిరిగిరావడంతో ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం నెలకొంది. ఆమెకు చికిత్స అందించి... తిరిగి తమ ఇంటికి చేర్చిన స్వచ్చంద సంస్థకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు నెలల క్రితం ఏపీలోని కృష్ణ జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ (75)కు కరోనా సోకడంతో గత నెల 12వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత మూడో రోజులకు ఆమె భర్త గిడ్డయ్య ఆస్పత్రికి వెళ్లగా ముత్యాల గిరిజమ్మ కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా వేరే వార్డుకు మార్చారేమోనని సమాధానం చెప్పారు. అయితే ఆస్పత్రి అంతా వెతికినా ఎక్కడా ఆమె కనిపించలేదు.
Recommended Video
మరోసారి సిబ్బందిని ప్రశ్నించగా మార్చురీలో ఉందేమో చూసుకోమని సలహా ఇచ్చారు. మార్చురీలో తన భార్య ముత్యాల గిరిజమ్మను పోలిన మహిళ మృతదేహాన్ని చూసి తన భార్యదేనని అనుకున్నాడు. దీంతో గత నెల 15వ తేదిన ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మరో వారం రోజులకు అంటే మే 23వ తేదీన గిరిజమ్మ, గిడ్డయ్య దంపతుల కుమారుడు రమేష్ కూడా కరోనాతో చనిపోయాడు. అతనికి కూడా అదే రోజు అంత్యక్రియలు జరిపిన కుటుంబ సభ్యులు ఇద్దరికీ కలిపి పెద్ద కర్మ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పూర్తి కావడం.. కరోనా నెగటివ్ రావడంతో ముత్యాల గిరిజమ్మను డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి ఆమె నేరుగా జగ్గయ్యపేటలోని ఇంటికి తిరిగొచ్చింది. గిరిజమ్మ చనిపోయిందని భావించి అంత్యక్రియలు కూడా నిర్వహించాక... ఆమె ఆటో దిగి ఇంటికి రావడం కుటుంబ సభ్యులను షాక్‌కి గురిచేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications