వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి పరిణామం.. తగ్గుతున్న ఖైదీలు... ! మూతబడుతున్న జైళ్లు...

|
Google Oneindia TeluguNews

నాగరికత పెరుగుతుంటే నేరాలు కూడ పెరుగుతున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా నేరాల సంఖ్య పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్దంగా కొనసాగుతుంది. ఓవైపు నేరాలు పెరుగుతుంటే ఇక్కడ మాత్రం తగ్గుతున్నాయని అధికారులు ప్రకటించారు. దీంతో ఖైదీలను ఉంచాల్సిన జైళ్లను మూసి వేయనున్నట్టు ప్రకటించారు..

తెలంగాణ రాష్ట్ర్రంలో ఉన్న మొత్తం 49 జైళ్లు ఉన్న్నాయి. అందులో 17 జైళ్లను ఖైదీలు లేకపోవడంతో మూసివేస్తున్నట్టు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రకటించారు. కాగా మూసివేసిన జైళ్లను ప్రత్యేకంగా అనాధలకు ,బిచ్చగాళ్లకు కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు.రాష్ట్ర్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల క్రమంగా నెరస్థుల రేటు కూడ తగ్గుకుంటూ వస్తుందని ఆయన చెప్పారు.

jail to close 17 jail because no prisoners

ఈనేపథ్యంలోనే ఆయా జైళ్లలో విడుదల చేయనున్న ఖైదీల లిస్టును గవర్నర్ కు పంపామని అయితే తిరిగి వచ్చిందని తెలిపిన ఆయన మరో లిస్టును ప్రిపేర్ చేస్తున్నట్టు తెలిపారు.కాగా శిక్షముగించుకుని సత్ప్రవర్తన కల్గిన ఖైదీల విడుదల అనంతరం వారికి ఉపాధి కల్పించడం కోసం 20 పెట్రోల్ పంపులను కొనసాగిస్తున్నామని వీటితో పాటు మరో 20 పెట్రోల్ పంపులకు కూడ ప్రణాళికలు రూపోందించామని తెలిపారు. కాగా కొత్తగా నిర్మిస్తున్న వాటిలో ట్రాన్స్‌జెండర్స్‌కు సైతం ప్రత్యేక పెట్రోల్ పంపును కేటాయిస్తున్నట్టు ఆయన వివరించారు.

English summary
Of the total 49 jails in the state, 17 will be closed soon due to insufficient prisoners, said Telangana Prisons Department Director General VK Singh. He also said that the closed jails will be utilised as special homes for beggars and orphans
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X