ప్రమాదంలో అభిమాని మృతి: దీనస్థితి తెలిసి పవన్ చేతుల మీదుగా రూ.1లక్ష సాయం
ఖమ్మం/హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందన ఖమ్మం జిల్లా జనసైనికుడి కుటుంబానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఎన్నారై జనసేన లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసింది. ఈ మేరకు జనసేన శతఘ్ని ట్విట్టర్‌లోను పేర్కొంది.
తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పార్టీ కార్యకర్త నాగాటి శ్రీను మృతి చెందారు. ఈ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. సోమవారం రాత్రి విజయవాడలోని పడమటలంకలో గల తన నివాసంలో మృతుడు తల్లి వీరలక్ష్మీకి సాయాన్ని పవన్ అందించారు.

కొణిజర్లకు చెందిన జనసేన కార్యకర్త నాగాటి శ్రీను మిట్టపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీను తండ్రి చిన్నతనంలోనే మృతిచెందటంతో తల్లి వీరలక్ష్మీ కుమారుడు శ్రీనును ఇంటర్ వరకు చదివించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినటంతో శ్రీనును చదువు మాన్పించి ఇద్దరు కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఖమ్మం జిల్లా జనసైనికుడు నాగటి శ్రీను కుటుంబానికి జనసేన అధినేత చేతుల మీదుగా NRI జనసేన లక్ష రూపాయల ఆర్థిక సాయం. pic.twitter.com/5Zq0l0AX3x
— JanaSena Shatagni | 9394022222 (@JSPShatagniTeam) June 26, 2018
ఈ సమయంలో కొడుకు రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందటంతో తల్లి వీరలక్ష్మీ ఒంటరిగా మిగిలింది. శ్రీను.. పవన్‌కు అభిమాని. శ్రీను దీనస్థితి తెలుసుకున్న ఎన్నారై జనసేన మిత్రబృందం ఈ ఆర్థిక సాయం ప్రకటించింది.












Click it and Unblock the Notifications