జయహో జగదీశన్న.. ఎస్పీ నినాదాలు; మండిపడుతున్న ప్రతిపక్షాలు; కొత్త వివాదంలో సూర్యాపేటజిల్లా ఎస్పీ!!
సూర్యాపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలలో సూర్యాపేట జిల్లా ఎస్పీ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. సూర్యాపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్.రాజేంద్రప్రసాద్‌తో కూడిన రెండు నిమిషాల వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో, రాజకీయ పార్టీల నాయకులలో చర్చనీయాంశంగా మారింది.

సభలో జయహో జగదీశన్న నినాదాలు చేసిన జిల్లా ఎస్పీ
సూర్యాపేట పట్టణంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో జిల్లా ఎస్పీ జయహో జగదీష్ అన్న అంటూ తన ప్రసంగంలో చేసిన నినాదాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. జిల్లా ఎస్పీ హోదాలో ఉండి, ఒక ఐపీఎస్ అయ్యుండి జగదీశ్ రెడ్డి కి జై కొడుతూ నినాదాలు చేయడం అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది.

విద్యార్థులతో నినాదాలు చేయించిన జిల్లా ఎస్పీ
వైరల్ అవుతున్న వీడియో లో సూర్యాపేట శాసనసభ్యుడు మరియు ఇంధన శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డిని నాయకుడిగా పొందడం ఎలా అదృష్టమో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి చెప్పి, విద్యార్థులు బాగా చదివి భవిష్యత్‌లో రాణించి మంత్రి గర్వపడేలా చేయాలని అన్నారు. మంత్రికి బహుమతిగా, విద్యార్థులు జయహో బాహుబలి అన్నట్టు జయహో మంత్రి జగదీశ్ రెడ్డి అని నినాదాలు చేయాలని ఆయన అన్నారు.
సభలో ఎస్పీ వ్యాఖ్యల వీడియో వైరల్ .. మండిపడుతున్న ప్రతిపక్షాలు
ఎస్పీ స్వయంగా జయహో జగదీష్ అన్న అంటుంటే సభలోనూ మంత్రికి జయ జయ ధ్వానాలు పలుకుతూ ఉంటే విద్యార్థులు నినాదాలు చేశారు. సభంతా జయహో జగదీష్ రెడ్డి నినాదాలతో ప్రతిధ్వనించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎస్పీ తీరును తప్పు పడుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ని పొగుడుతూ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, విద్యార్థులతో నినాదాలు చేయడం సిగ్గుచేటని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్
అంతేకాదు గౌరవ ప్రతిష్టలు కలిగిన యూనిఫాం వేసుకుని, ఒక రాజకీయ నాయకుడికి జై కొట్టడం అగౌరవమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలలో కలెక్టర్లు సీఎం కాళ్ళు మొక్కడం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ వారిని ఎమ్మెల్సీ చేయడం చూసామని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఈ విధంగా రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications