మేం కలువలేదు: కేసీఆర్‌కు జీవన్ రెడ్డి
హైదరాబాద్: తెరాస నేతలు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణలో టిడిపితో కాంగ్రెస్ పార్టీ కలిసిందని తెరాస చెప్పడం సరికాదన్నారు. మల్లన్న సాగర్ పైన అధికార పార్టీ దారుణంగా వ్యవహరిస్తోందని అందుకే ప్రతిపక్షాలన్నీ కలిశాయన్నారు. తెలంగాణలో 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలన్నారు. తెలంగాణలో 50 రోజుల పాటు 144 సెక్షన్ పెట్టడం ఏమిటన్నారు. దేశంలో ఏ గ్రామంలో ఇలా లేదన్నారు.












Click it and Unblock the Notifications