జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!!
మాజీ మంత్రికి కేసీఆర్ బిగ్ టాస్క్ అప్పగించారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో మాజీ సీఎం సిద్దం అవుతున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో లాంఛనమే. ఇందు కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. 2023 ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కువగా ఫాం హౌస్ కే పరిమితం అవుతున్న కేసీఆర్.. జీవన్ రెడ్డితో భేటీ వేళ కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీలో ముఖ్య బాధ్యతలను అప్పగించేందుకు సిద్దం అయ్యారు. ఆపరేషన్ కాంగ్రెస్ పైన గురి పెట్టారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి ఈ నెల 20న గులాబీ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. కేసీఆర్‌తో 'అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే ఇక్కడకు పంపాడు' అని జీవన్ రెడ్డి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తనకు సమర్ధత ఉంది కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం 14 సార్లు భీ ఫామ్ ఇచ్చిందని జీవన్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజల్లో నినాదం వస్తున్నట్లు వివరించారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని, ప్రజల కోసం కలిసి పనిచేద్దామని జీవన్‌రెడ్డికి కేసీఆర్ స్పష్టం చేసారు.

జీవన్ రెడ్డికి కీలక బాధ్యతలకు రంగం సిద్దం
ఈ నెల 20న జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, నియోజకవర్గ ప్రజల సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరతానని జీవన్‌రెడ్డి తెలిపారు. కాగా.. కాంగ్రెస్ లో ఇబ్బందులు పడుతున్న నేతలతోనూ మాట్లాడి.. వారిని ఆకర్షించే ప్రయత్నాల పైన బీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి పార్టీలో చేరిన తరువాత కీలక బాధ్యతలను అప్పగించేలా కేసీఆర్ స్కెచ్ సిద్దం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన జీవన్ రెడ్డి ద్వారా ఇక కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
అందులో భాగంగా ఇప్పటికే జీవన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ తరువాత వరుసగా జిల్లాల పర్యటనలు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ వీడటం పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుంటే...బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పైన అస్త్రంగా ప్రయోగించాలని ఆలోచనలు చేస్తోంది.












Click it and Unblock the Notifications