కమలం గుర్తు ఓటర్లు మర్చిపోకుండా.. మునుగోడులో వినూత్నంగా.. జీవిత రాజశేఖర్ ఏం చేస్తున్నారంటే!!
మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ హేమాహేమీలను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్ ల ప్రచారంతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఇక బీజేపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలక నాయకులు రంగంలోకి దిగారు.

జీవితా రాజశేఖర్ వినూత్న ఎన్నికల ప్రచారం
ఇప్పటికే బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుండగా, ఎన్నికల ప్రచార రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బాబు మోహన్, జీవిత రాజశేఖర్, ధర్మపురి అరవింద్ తదితరులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న జీవితారాజశేఖర్ వినూత్నంగా తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఓటర్ల చేతులకు కమలం పువ్వు గుర్తుతో గోరింటాకు
బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న బిజెపి నేత సినీ నటి జీవిత రాజశేఖర్ చౌటుప్పల్ మండలం లో బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వినూత్నంగా అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మండలం లోని దేవలమ్మ నాగారం గ్రామంలో మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన జీవిత రాజశేఖర్ ఇంటింటికి వెళ్లి ఓటర్ల చేతికి కోన్ తో గోరింటాకు పెట్టిస్తూ, వారి చేతుల పై కమలం గుర్తును వేయిస్తున్నారు.

గడపగడపకు తిరుగుతూ .. గోరింటాకుతో చేతిలో కమలం
అంతేకాదు గడపగడపకు తిరుగుతూ గోరింటాకు పెట్టిస్తున్న జీవిత రాజశేఖర్, వారి చేతిలో వేసిన కమలం పువ్వు గుర్తు పైనే ఓటు కూడా వేయాలంటే విజ్ఞప్తి చేస్తున్నారు. సినీనటి జీవిత రాజశేఖర్ ప్రచారానికి రావడంతో మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికి, జీవిత తో మాట్లాడుతున్నారు. కొందరు మహిళల చేతులకు జీవిత-రాజశేఖర్ స్వయంగా కోన్ తో కమలం పువ్వు గుర్తు ను గోరింటాకుగా పెట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరూ కమలం గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

జీవిత ఎన్నికల ప్రచారంతో బీజేపీలో జోష్
గ్రామంలో కలియతిరుగుతూ, ప్రతి ఒక్కరితో సరదాగా మాట్లాడుతూ అందరిలోనూ ఉత్సాహం నింపుతున్నారు. వెళ్ళిన ప్రతీ ఇంటిలోనూ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు. జీవిత రాజశేఖర్ ప్రచార సరళి మునుగోడు బిజెపి నేతలలో సైతం జోష్ ను పెంచుతుంది. మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించి మునుగోడు అభివృద్ధికి బాటలు వేసుకోవాలని, ఆయన రాజీనామా చేసిందే అభివృద్ధి చేయడం కోసమని జీవిత రాజశేఖర్, ప్రజలను తన మాటలతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications