బీజేపీలో చేరిన జీవితా రాజశేఖర్: బండి సంజయ్ చర్యతో అంతా షాక్, పార్టీ మార్పులపై సెటైర్లు
హైదరాబాద్: సినీ నటి జీవితా రాజశేఖర్ మరోసారి పార్టీ మారారు. 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో కొనసాగిన ఆమె.. తాజాగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.
Recommended Video

ఈసారి ఒంటరిగానే బీజేపీలోకి జీవిత..
అయితే, ఎప్పుడూ తన భర్త, ప్రముఖ నటుడు రాజశేఖర్‌తో కలిసి జంటగా పార్టీలు మారే జీవిత.. ఈసారి మాత్రం ఒంటరిగానే వచ్చి బీజేపీలో చేారు. జీవితను పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్.. ఆమెకు కండువా వేయడానికి నిరాకరించారు. దీంతో తనకు తానే కాషాయ కండువా కప్పుకున్నారు జీవిత. కాగా, గతంలోనూ కొన్నాళ్లపాటు రాజశేఖర్ దంపతులు బీజేపీలో కొనసాగిన విషయం తెలిసిందే.

ఏపీలో కాదు.. ఇక తెలంగాణలోనే..
రాజశేఖర్, జీవితా దంపతుల రాజకీయ ప్రయాణాన్ని గమనించినట్లయితే.. దాదాపు అన్ని పార్టీల్లోనూ చేరి కొంత కాలానికే మరో పార్టీకి మారారు. అంతేగాక, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటూ వచ్చిన ఈ జంట.. ఈసారి మాత్రం తెలంగాణలో రాజకీయ ప్రవేశం చేయడం గమనార్హం. బీజేపీలో చేరాలనుకుంటే ఏపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో పార్టీలో చేరవచ్చు.. కానీ, ఇప్పుడు మాత్రం తెలంగాణలో జోరుమీదున్న బీజేపీలోనే చేరడం గమనార్హం.

జీవిత.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారా?
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు పార్టీల్లో పనిచేశారు జీవితా రాజశేఖర్ దంపతులు. ఇప్పటి వరకు తమకు కలిసి రానీ రాజకీయం తెలంగాణలోనైనా కలిసి వస్తుందని ఈ సినీ దంపతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో నగరంలోనే ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జీవితా రాజశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకు సాకారం అవతాయో వేచి చూడాలి.

రాజశేఖర్, జీవిత దంపతుల పార్టీ మార్పులపై సెటైర్లు.. ఇక ఒక్కటే
కాగా, రాష్ట్ర విభజనకు ముందు 2008లో కాంగ్రెస్ పార్టీలో చేిరన రాజశేఖర్ జీవితా దంపతులు. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. ఆ పార్టీ అప్పటి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ కొంతకాలానికే వైసీపీలో చేరారు. అయినా వీరికి ఆశించిన ప్రాధాన్యత లభించకపోవడంతో తాజాగా, తెలంగాణ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినీ దంపతుల పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ ఇలా దాదాపు అన్ని పార్టీలనూ చుట్టేసిన ఈ జంటకు ఇక మిగిలింది జనసేన లేదంటే మరో కొత్త పార్టీ పుట్టుక రావాలంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications