జనసేన: వన్ మెన్ ఆర్మీనా? మెనీ మెన్ పార్టీనా? అసలు ఈ మూడేళ్లలో సాధించిందేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన పార్టీ పెట్టి మూడేళ్లు నిండిన తరుణంలో పవన్ బలాలు, బలహీనతలపై రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పురుడు పోసుకున్నప్పటికీ, గుర్తింపు పొందిన పార్టీగా మారడానికి మాత్రం మరో ఆరునెలలు పట్టింది.

చదవండి: ఆఫర్: చిరంజీవితో చర్చకు జగన్ ఓకే, జాగ్రత్తపడుతున్న చంద్రబాబు?

మూడేళ్లుగా పార్టీ నిర్మాణం పక్కన పెట్టి కేవలం ప్రజా సమస్యలు మాత్రమే వెలుగులోకి తేవాలని భావించిన పవన్ కళ్యాణ్ ఆలోచనలు కొంతమందిని మెప్పించి మరికొంతమందిని నొప్పించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర శక్తిగా ఎదగాలని భావించిన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణం చేపడతామని కూడా ప్రకటించారు.

ప్రశ్నించే పార్టీయేనా? అధికారం వద్దా?

ప్రశ్నించే పార్టీయేనా? అధికారం వద్దా?

ఎన్డీయే భాగస్వామ్యం నుంచి ఏడాదికే తప్పుకున్నా, టీడీపీకి మాత్రం కాస్త దగ్గరగానే ఉంటూ రాజకీయ లౌక్యం ప్రదర్శిస్తున్నారు జనసేన అధినేత. కులం ముద్ర పడకుండ 2019 ఎన్నికల్లో రాయలసీమ జిల్లా అయిన అనంతపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి కొంతవరకు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. తాను పార్టీ పెట్టింది అధికారం కోసం కాదని పదే పదే చెబుతున్నారు. మార్పు తీసుకురావడానికే వచ్చానని పవన్ పలుమార్లు వివరించారు. పార్టీ అన్నాక అధికారం చేపట్టడానికే కాకపోతే మరెందుకని ఇటీవల బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ లాంటివారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షం స్థాయికి...

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షం స్థాయికి...

మనకు కొన్ని సిద్ధాంతాలు, విలువలు ఉండొచ్చు. ఒక పార్టీగా వాటిని సాధించలేం. అధికారంలోకి వచ్చాక ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పరిపాలన సాగించాలన్నది రామ్ మాధవ్ వివరణ. పవన్ ఈ వాదనతో ఏకీభవించకపోవచ్చు.. అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావనకు ఆయన వ్యతిరేకం. కొన్ని సమస్యలకు పరిష్కరించే విషయంలో తీసుకున్న చొరవ చూస్తుంటే రాజకీయ పార్టీలు ఇలా కూడా చేయవచ్చా? అన్న కొత్త వరవడికి పవన్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విపక్షం వీక్ అవుతుందని, ఆ స్థానంలో జనసేన ఆక్రమిస్తుందనే ధీమానా? ప్రస్తుతం జనసేన అడుగులు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.

మోడీ సరసన కూర్చున్నా...

మోడీ సరసన కూర్చున్నా...

ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకే గట్టి పోటీ ఇచ్చిన పవన్ వ్యూహాత్మకంగా ఒక్కసారి కూడా జగన్‌తో కలిసి పనిచేయకపోవడం గమనార్హం.. హోదా విషయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సభలు పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏకీ పారేశారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోడీ సరసన కూర్చుని, ఆపై కేంద్రంతో విభేదించి విమర్శలు చేయడం కమలనాధులకు మింగుడుపడలేదు. రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీకి జనసేన దూరంగా జరగక తప్పదని అందరూ భావించినా ప్రభుత్వ అనుకూల వైఖరి వలన ఆ పరిస్థితి రాలేదు.

అధికారంలో లేకుండానే మూడేళ్లు...

అధికారంలో లేకుండానే మూడేళ్లు...

ఇక పార్టీ నిర్మాణం విషయానికి వస్తే పవన్ సాగదీత సొంతపార్టీ నేతలకే నచ్చకపోయినా పవన్ నిర్ణయాన్ని మాత్రం మూడేళ్లుగా గౌరవిస్తూనే వచ్చారు.. మెజారిటీ సందర్బాల్లో ట్విట్టర్ ద్వారా తన నిరసనను వినిపించిన పవన్ కొన్ని సందర్భాల్లో విమర్శలనూ మోయాల్సి వచ్చింది. ఏది ఏమైనా అధికారంలో లేకపోయినా అధికారంలో లేకుండా ప్రస్తుతం ఉన్నసామాజిక పరిస్థితుల్లో పార్టీని మూడేళ్లపాటు నెట్టుకురావడం అంత తేలికైన పనికాదు. 2014 ఎన్నికల్లో కనీసం 4,5 స్థానాల్లో జనసేన పోటీ చేసి గెలిచి ఉంటే పార్టీ గొంతు చట్టసభల్లో వినిపిస్తూ ఉండేదని పవన్ అనాలోచితంగా ఉండటం వల్లనే కొంత మేర నష్టం జరిగిందన్నది పార్టీలో ఇతరుల వాదనగా వినిపిస్తోంది.

ఊపందుకున్న పార్టీ నిర్మాణం...

ఊపందుకున్న పార్టీ నిర్మాణం...

ఈ ఏడాది అక్టోబర్ నుంచి పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుందని ప్రకటించిన పవన్ ఇప్పటికే జనసేవా దళ్ విద్యార్థి విభాగం పనులు పూర్తిచేయగా యువజన విభాగం, మహిళా విభాగం నిర్మాణం మరొక నెల రోజుల్లో పూర్తిచేయనున్నారు.. అమరావతి, హైదరాబాద్ లలో పార్టీ కార్యాలయాలు నిర్మించే దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.

బరిలోకి ఒంటరిగానా? పొత్తులతోనా?

బరిలోకి ఒంటరిగానా? పొత్తులతోనా?

2019 సాధారణ ఎన్నికల్లో పొత్తులకు సిద్ధపడకపోతే జనసేన పార్టీ స్వయంగా 175 స్థానాల్లో పోటీ చేయగలదా ? అన్న అనుమానం పార్టీ నేతల్లోనే కనిపిస్తోంది. తన ప్రయాణం సీపీఎం పార్టీతో ఇప్పటికే ప్రారంభమయ్యిందన్న పవన్ రాష్ట్ర స్థాయిలో తృతీయ ఫ్రంట్ కి బాటలు వేస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. జయప్రకాష్ నారాయణ్, గద్దర్, కమల్ హాసన్ లాంటి వ్యక్తులతో పవన్ కలిసి పనిచేయొచ్చు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దక్షిణాది ఆత్మ గౌరవ నినాదంతో పవన్ మరొక నూతన శక్తిగా ఆవిర్భవించబోతున్నారా? అన్న చర్చ కూడా మొదలైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena Party is still a One Many Army? or It is a Party of many men? Already 3 years completed. Now what is the Chief of JanaSena's next step? Is he going to start the building of the party cadre? In coming elections will Jana Sena contestent on it's own or it will associate with other parties?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి