6 నుంచి జనసేన సమన్వయకర్తల ఎంపిక, పవన్ ఫ్యాన్స్ మళ్లీ తిడుతున్నారు: మ‌హేశ్ క‌త్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి పార్టీ సమన్వయకర్తల ఎంపికను చేపట్టనున్నట్లు జనసేన తెలిపింది. ఎంపికైన సమన్వయకర్తలతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.

పార్టీ సమన్వయకర్తల నియామకానికి జనసేన ఇప్పటికే సన్నాహం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ స్థానాల వారీగా ఈ సమన్వయకర్తల నియామకాన్ని చేపట్టనున్నారు.

janasena

తెలుగు రాష్ట్రాల్లోని 42 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం చేస్తున్నట్లు జనసేన ప్ర‌క‌ట‌న చేసింది. మొత్తం 840 మంది పార్టీ స‌మన్వ‌య‌క‌ర్త‌ల నియామ‌కానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఎల్లుండి నుంచి జనసేన సమన్వయకర్తల ఎంపిక ప్రక్రియను ప్రారంభించ‌నున్నారు. వ‌చ్చేనెల 7 నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ మ‌ళ్లీ వేధిస్తున్నారు: మహేష్ కత్తి

సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు త‌న‌ను వేధిస్తున్నార‌ంటూ సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆ మ‌ధ్య మీడియా ముందుకు వ‌చ్చి త‌న బాధ‌ను చెప్పుకున్న విష‌యం తెలిసిందే.

అయితే ఆయ‌న‌కు ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి వేధింపులు ఇంకా తగ్గలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులంటే ఎలాగుంటారో చెబుతూ.. వాట్స‌ప్‌లో త‌న‌ను బూతులు తిడుతూ మెజేస్‌లు పెడుతున్నార‌ంటూ మ‌హేశ్ క‌త్తి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న‌ను తిడుతున్నార‌డానికి ఇదే సాక్ష్యం అంటూ వాట్స‌ప్ స్క్రీన్ షాట్‌ని కూడా ఆయన పోస్ట్ చేశాడు. అందులో ప‌రుష ప‌ద‌జాలంతో మ‌హేశ్ క‌త్తిని పవన్ ఫ్యాన్స్ తిట్టిన‌ట్లు కనిపిస్తోంది. అలాగే ఓ మొబైల్‌ నెంబ‌రు నుంచి త‌న‌కు కాల్ వ‌చ్చింద‌ని, త‌న‌ను ఓ అభిమాని బెదిరించాడ‌ని మ‌హేశ్ క‌త్తి పేర్కొంటూ ఆ ఫోన్ నెంబ‌రు కూడా పోస్ట్ చేశాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jenasena Party announced that it is going to conduct coordinators selection from 6th November. After the selection, Jenasena Chief Pawan Kalyan will conduct a meeting with these coordinators, it seems. On the other hand movie critic Mahesh Katti once again alleged that Pawan Kalyan fans still thretening him. In his facebook page, he posted screen shots of the whatsapp messages what he received.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి