Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: 'ఇద్దరూ ఒక్కటయ్యారు,నలిగిపోతున్నా', అసలేం జరిగింది?

Recommended Video

    Cash For Vote Scam : KTR Blackmailed Me Says Mathaiah

    హైదరాబాద్/న్యూఢిల్లీ/అమరావతి: ఓటుకు నోటు కేసు శుక్రవారం కీలక మలుపు తిరిగింది. మూడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన, ప్రభుత్వాలే ఇబ్బందుల్లో పడుతాయో అన్నంత ప్రకంపనలు రేపిన ఈ కేసు ఆ తర్వాత చల్లబడింది.

    చదవండి: 'ఓటుకు నోటు కేసు'లో కీలక మలుపు! అప్రూవర్‌గా మారతానంటూ సుప్రీంకోర్టుకు మత్తయ్య లేఖ!

    అయితే ఈ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో అనూహ్య మలుపు తిరిగింది. తాను అన్ని విషయాలు చెబుతానంటూ ఆయన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

    చదవండి: ఓటుకు నోటులో మత్తయ్య కీలకం, అప్రూవర్‌గా మారితే!

    కీలక నిందితులు వీరే

    కీలక నిందితులు వీరే

    2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు వెలుగు చూసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ పట్టుబడినట్లుగా ఏసీబీ అభియోగం మోపింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లు తొలి ముగ్గురు నిందితులు కాగా, మత్తయ్య నాలుగో నిందితుడు.

    చంద్రబాబు పాత్ర ఉందంటూ

    చంద్రబాబు పాత్ర ఉందంటూ

    ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు కూడా వినిపించింది. స్టీఫెన్ సన్‌తో ఫోన్లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని అభియోగాలు ఉన్నాయి. అది చంద్రబాబు గొంతా కాదా అని తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపించారు.

    ముగ్గురి అరెస్ట్, విడుదల

    ముగ్గురి అరెస్ట్, విడుదల

    ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సహా మిగతా ఇద్దరు నిందితులు జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. అయితే రేవంత్ సహా ముగ్గురు జైలులో ఉన్నప్పుడు జెరూసలేం మత్తయ్య మాత్రం పోలీసులకు దొరకలేదు.

    ఏపీలో తలదాచుకున్న మత్తయ్య, హైకోర్టుకు

    ఏపీలో తలదాచుకున్న మత్తయ్య, హైకోర్టుకు

    ఓటుకు నోటు కేసు నేపథ్యంలో అప్పుడు మత్తయ్య ఏపీలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లుగా ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్లి.. ఇందులో తన పాత్ర లేదని, తనపై కేసు నమోదు కాకుండా చూడాలని కోరారు. ఆ తర్వాత నిందితులకు బెయిల్ రావడం, కేసు విచారణ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఇన్నాళ్లయినా ఇంకా కొలిక్కి రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో ఎందరినో విచారించారు. నాటి టీడీపీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తనయుడిని కూడా పోలీసులు విచారించారు.

    ఇప్పుడు ఊహించని మలుపు

    ఇప్పుడు ఊహించని మలుపు

    ఇదిలా ఉండగా, జెరూసలేం మత్తయ్య ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. తాను అప్రూవర్‌గా మారుతానని సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. తాను అన్ని విషయాలు చెబుతానని సీజేకు లేఖ ఇచ్చారు.

    ఫోన్ ట్యాపింగ్ వర్సెస్ ఓటుకు నోటు

    ఫోన్ ట్యాపింగ్ వర్సెస్ ఓటుకు నోటు

    ఓటుకు నోటు కేసు సమయంలో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ తదితరులపై కేసు పెట్టడంతో ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కోణంలో దర్యాఫ్తు చేశారు. ఓటుకు నోటు అంశం ద్వారా చంద్రబాబును చిక్కుల్లో నెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే, ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ప్రభుత్వం చూసిందనే ఆరోపణలు ఉన్నాయి.

    రెండు పార్టీల వ్యవహారం నేను నలిగిపోతున్నా

    రెండు పార్టీల వ్యవహారం నేను నలిగిపోతున్నా

    ఓటుకు నోటు కేసులో అప్రూవర్‌గా మారుతానని చెప్పిన జెరూసలేం మత్తయ్య ఆ తర్వాత ఢిల్లీలో మాట్లాడారు. ఇది రెండు పార్టీల మధ్య వ్యవాహారమని, ఇందులో తాను నలిగిపోతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు ఓటుు నోటు కేసు వాయిదా ఉన్నప్పుడల్లా తనకు సమాచారం ఇచ్చేవారని, అయితే ఇప్పుడు ఎవరి నుంచి స్పందన లేదని అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు.

    రెండు ప్రభుత్వాల నుంచి స్పందన లేదు

    రెండు ప్రభుత్వాల నుంచి స్పందన లేదు

    కేసు హైకోర్టులో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సహకరించిందని, ఇప్పుడు సుప్రీం కోర్టుకు విచారణకు రావడంతో తనకు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని మత్తయ్య చెప్పారు. అందుకే తాను పార్టీ ఇన్ పర్సన్‌గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేశానని చెప్పారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాల నుంచి స్పందన లేదన్నారు.

    వారెంట్ జారీ అవుతుందని భయపడి వచ్చా

    వారెంట్ జారీ అవుతుందని భయపడి వచ్చా

    ఇప్పుడు తనకు వాయిదాల గురించి ఇద్దరూ చెప్పడం లేదని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనకు ఫాలో అప్ ఇవ్వడం లేదని, డేట్ తెలియకుంటే తనకు వారెంట్ జారీ అవుతుందని భయపడి తాను సుప్రీం కోర్టుకు వచ్చానని చెప్పారు. మూడేళ్లుగా తనకు అప్ డేట్స్ ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు.

    వారిద్దరూ ఒక్కటయ్యాక తనను దోషిని చేస్తారేమోనని

    వారిద్దరూ ఒక్కటయ్యాక తనను దోషిని చేస్తారేమోనని

    ఓటుకు నోటు కేసు హైకోర్టులో ఉన్నప్పుడు తన ప్రమేయం లేదని చెప్పేవారని మత్తయ్య అన్నారు. సుప్రీం కోర్టుకు వచ్చాక వదిలేశారని చెప్పారు. వారిద్దరూ ఒక్కటయ్యాక తనను దోషిని చేస్తారోమేననే ఆందోళనతో సుప్రీం కోర్టుకు వచ్చినట్లు చెప్పారు. సీజేను కలిశానని, ఏదైనా సమాచారం ఉంటే తనకు ఇవ్వమని చెప్పానని అన్నారు.

    ఇక్కడ కేసు పెట్టమని అక్కడ, అక్కడ కేసు పెట్టమని ఇక్కడ

    ఇక్కడ కేసు పెట్టమని అక్కడ, అక్కడ కేసు పెట్టమని ఇక్కడ

    తనను వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మత్తయ్య అన్నారు. వారిపై కేసు పెట్టాలని తెలంగాణలో వేధిండం, ఏపీకి వెళ్తే కేటీఆర్ గన్‌మెన్ మీకు కాల్స్ చేశారు కాబట్టి కేసు పెట్టమని అక్కడ.. జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు తనకు కేసు డేట్స్ చెప్పకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. తాను ఢిల్లీ వచ్చి సీజేని కలిసి తనకు సమాచారం ఇవ్వాలని చెప్పానని, అన్నీ చెబుతానని చెప్పానని, పిటిషన్ వేశానని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+