వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిట్టిందని... వరంగల్లో ప్రేమోన్మాది ఘాతుకం, ఐటీ కారిడార్లో గార్డులకు ఆయుధాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆత్మకూరు మండలం ఓగ్లాస్ పూర్‌లో కేర్ ఫార్మసీ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి.. తనను ప్రేమించడం లేదని ఓ యువతి గొంతు కోసి చంపేందుకు యత్నించాడు.

విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి పైన నిర్భయ కేసు నమోదు చేశారు.

కాగా, ఆమె ప్రియురాలిగా కూడా వార్తలు వస్తున్నాయి. ఓ విషయమై ఆమె తిట్టిందని కూడా చెబుతున్నారు. ప్రియురాలు తిట్టడంతో ఆమె గొంతు నులిమి హత్యాయత్నానికి పాల్పడ్డాడని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రేమోన్మాదిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Jilted lover tries to kill girl

మద్యం పట్టివేత

మెదక్ జిల్లా రామాయంపేటలో అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న నిందతులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.25 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ ఐటి కారిడార్‌కు అలర్ట్

హైదరాబాదులోని ఐటీ కారిడార్లో సైబరాబాద్ పోలీసులు టెర్రర్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీల సెక్యూరిటీ గార్డులకు తుపాకులు తదితర ఆయుధాలను ఇవ్వాలని నిర్ణయించినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

ఎటువంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సెక్యూరిటీ గార్డుల చేతుల్లో ఆయుధాలుంటే మంచిదని భావిస్తున్నామని, ఏవైనా దాడులు జరిగితే పోలీసులు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్పందించేందుకు వీలుంటుందని, ఆయుధాలు ఇచ్చే ముందు వాటిని ఎలా వాడాలన్న విషయం గురించి చెప్పేందుకు శిక్షణ ఇస్తామన్నారు.

మాదాపూర్, గచ్చిబౌలీ పరిసరాల్లో 500 వరకూ రిజిస్టర్డ్ ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిల్లో పని చేస్తున్న గార్డుల్లో ఇద్దరిని ఎంపిక చేసి ఒక బేసిక్ వెపన్ (పిస్టల్ వంటిది), మరో అడ్వాన్డ్స్ వెపన్ ఇస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

English summary
Jilted lover tried to kill girl student in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X