థర్డ్ ఫ్రంట్: కేసీఆర్‌తో జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ భేటీ, చర్చ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, బుధవారం ప్రగతిభవన్‌లో జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయనను కలవడం గమనార్హం.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు వంటి అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్, హేమంత్ సోరెన్ కలిసి భోజనం చేసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో పాటు హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కేసీఆర్, ఎంపీ కవిత.. కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు కూడా.












Click it and Unblock the Notifications