వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇకపై ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్; ప్రతిపక్షాల విమర్శలకు సీఎం కేసీఆర్ చెక్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ను కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూసిన జాబ్ నోటిఫికేషన్లను ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయని కేసీఆర్ ప్రకటన చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వెల్లడించారు.

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్


ఇదిలా ఉంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు తెచ్చుకున్నామని నియామకాల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి శాఖలో ఖాళీలను ముందుగానే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

శాఖల వారీగా ప్రతి ఏడాది ఖాళీల భర్తీ

శాఖల వారీగా ప్రతి ఏడాది ఖాళీల భర్తీ

ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయని కెసిఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తారని, తద్వారా నోటిఫికేషన్లు విడుదల అవుతాయని పేర్కొన్న కెసిఆర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అన్ని నియామక పరీక్షలలో పోటీ పడడానికి వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కెసిఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొలువుల జాతర... నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ఫోకస్

రాష్ట్రవ్యాప్తంగా కొలువుల జాతర... నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ఫోకస్

రాష్ట్ర వ్యాప్తంగా 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాలలో అత్యధికంగా హైదరాబాదులో 5,268 ఖాళీలు ఉండగా వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 556 పోస్టులు ఉన్నాయని తెలుస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారిన నిరుద్యోగ సమస్యపై సీఎం కేసీఆర్ ఎట్టకేలకు దృష్టిసారించారు.

Recommended Video

Telangana Job Notifications: ఎన్నికల టైం CM KCR Big Announcement | Assembly Sessions |OneindiaTelugu
ఒక్క ప్రకటనతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టిన కేసీఆర్

ఒక్క ప్రకటనతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టిన కేసీఆర్


నిరుద్యోగ సమస్యపై బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలకు చెక్ పెట్టటం కోసం, అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

English summary
With the release of job notifications in Telangana, CM KCR announced that from now on job replacement calendar will be given every year. With this, the CM KCR checked the criticisms of the opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X