సొంత భార్యే జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయించారా..? సంచలన విషయాలు వెలుగులోకి

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్‌కు పిలిపించారని తెలిపింది.

2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Johnny Master arrested by his own wife

అయితే జానీ మాస్టర్ గత మూడు రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.దీంతో జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే జానీ అరెస్ట్ వెనుక అతని భార్య హస్తం ఉందనే వార్తలు తెర మీదకు వస్తున్నాయి. ఈ రోజు సడన్‌గా జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో దర్శనం ఇచ్చారు. భర్త ఆచూకీ తెలపాలని పోలీసులు కోరడంతో జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నది చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ప్రత్యేక బృందం గోవాలో డ్యాన్స్ మాస్టర్ జానీని అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య సమాచారం ఇవ్వడంతోనే ఆయన్ను పట్టుకోగలిగారు పోలీసులు. మరి కొన్ని గంటల్లో జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకురానున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+