మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన(ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షల అమలు మొదలైంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ-బ్లాక్‌ (సమతా బ్లాక్‌)లోకి జర్నిలిస్టులు అడుగుపెట్టకుండా చర్యలు తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సీపీఆర్‌వో గదిలో కూర్చున్న జర్నలిస్టులను భద్రతా సిబ్బంది బలవంతంగా బయటికి పంపించేశారు.

మీడియాను అనుమతించవద్దని పౌరసంబంధాల అధికారి తమను ఆదేశించారని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) సూచించారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ బయటికి వచ్చారు. సీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

మంత్రుల కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు. దీంతో జర్నలిస్టుల ఆందోళన విషయం తెలిసిన సీఎంపీఆర్వో కార్యాలయ అధికారులు బయటకు వచ్చి మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవని, వారిని లోనికి రావాలని సూచించగా... దీనికి మీడియా ప్రతినిధులు నిరాకరించారు.

ఈ విషయంపై ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణకు ఫిర్యాదు చేశారు. సమైక్య రాష్ట్రంలో తాము నేరుగా సీఎంను కలిసేవారమని, తెలంగాణ వచ్చాక సీఎంను కలిసేందుకు అనుమతించకపోవడం దారుణమని, తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు.

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షల అమలు మొదలైంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ-బ్లాక్‌ (సమతా బ్లాక్‌)లోకి జర్నిలిస్టులు అడుగుపెట్టకుండా చర్యలు తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సీపీఆర్‌వో గదిలో కూర్చున్న జర్నలిస్టులను భద్రతా సిబ్బంది బలవంతంగా బయటికి పంపించేశారు.

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాను అనుమతించవద్దని పౌరసంబంధాల అధికారి తమను ఆదేశించారని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) సూచించారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ బయటికి వచ్చారు. సీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

 మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మంత్రుల కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు. దీంతో జర్నలిస్టుల ఆందోళన విషయం తెలిసిన సీఎంపీఆర్వో కార్యాలయ అధికారులు బయటకు వచ్చి మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవని, వారిని లోనికి రావాలని సూచించగా... దీనికి మీడియా ప్రతినిధులు నిరాకరించారు.

 మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మీడియాపై ఎలాంటి నియంత్రణ లేదు. మీడియాతో విరోధం పెంచుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సహేతుకమైన నియంత్రణ అమలు చేయాలని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేవలం సీఎం బ్లాక్‌ వరకు మాత్రమే మీడియాపై నియంత్రణ ఉంటుంది. వివిధ శాఖల వార్తలు రిపోర్ట్‌ చేసే జర్నలిస్టులు శాఖల అనుమతితో ఆయా బ్లాక్‌లకు వెళ్లవచ్చు. ఈ కోణంలోనే ప్రభుత్వం ఆలోచిస్తోంది'' అని అల్లం నారాయణ తెలిపారు.

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

పాత్రికేయులపై పూర్తిగా నియంత్రణ అమలు చేస్తే ఒప్పుకోబోమన్నారు. జర్నలిస్టుల ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. సీపీఆర్‌వో గది నుంచి జర్నలిస్టులను బయటకు పొమ్మనటం దురదృష్టకరమని ఖండించారు. అనంతరం అల్లం నారాయణ సచివాలయ జర్నలిస్టులతో సమావేశం అయ్యారు.

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన


మధ్యాహ్నం జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ‘‘లేవు లేవంటూనే ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తోంది. దీనికి మేం అంగీకరించం'' అని జర్నలిస్టులు తెలిపారు. అల్లం నారాయణ స్పందిస్తూ ‘నేనూ జర్నలిస్టునే. ఎలాంటి ఆంక్షలు వద్దు' అంటూ మీడియా ప్రతినిధులతో కలిసి సి-బ్లాక్‌లోని సీపీఆర్‌వో వనం జ్వాలా నరసింహారావుతో భేటీ అయ్యారు.

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియాకు నో ఎంట్రీ: జర్నలిస్టుల నిరసన

మీడియా ప్రతినిధులను ఎందుకు బయటకు పంపించారని ప్రశ్నించారు. ‘‘ఇప్పటి వరకు మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవు. జర్నలిస్టులు బయటికి వెళ్లాలని మేం చెప్పలేదు. సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలతో మాకు సంబంధం లేదు. జర్నలిస్టులు సీపీఆర్‌వో గదిలో ఉండొచ్చు'' అని వనం జ్వాలా నరసింహారావు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+