ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన వారెవరు ? ఈ దాడి రాజకీయ నేపథ్యంలో జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాల నేపథ్యంలో జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video


ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో ఇంట్లోనే బీజేపీ నేత మర్డర్
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో బిజెపి నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం రామారావు ఇంట్లోకి బైక్ పై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రామారావు పై కత్తులతో దాడి చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు . రామారావుపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేసిన వారు అక్కడ నుండి పరారయ్యారు . ఊహించని విధంగా జరిగిన దాడిలో రామారావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ తీవ్ర గాయాలపాలైన రామారావు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ నేత మర్డర్ తో ఉద్రిక్తత
దీంతో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లాలో బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రామారావు బీజేపీలో ఆర్టీఐ సెల్ కన్వీనర్ గా పని చేస్తున్నారు . మరో మూడు నెలల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ నేత హత్య జరగడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.

ఆర్ధిక లావాదేవీలే రామారావు మర్డర్ కు కారణం .. ప్రాధమిక దర్యాప్తులో తేలిందిదే
అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావు పై దాడి జరిగినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు గా సమాచారం. దాడికి పాల్పడిన నిందితుడు మాడపాటి రాజేష్ మధిర కోర్టులో లొంగిపోయినట్లు గా సమాచారం. ఇంకో ఆగంతకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు వీరు ఆర్ధిక లావాదేవీల నేపధ్యంలో హత్య చేశారా ? లేకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications