జూబ్లీహిల్స్ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..!
తెలంగాణ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ బై ఎలక్షన్ లో దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే ఆధిక్యం కనబరిచిన నవీన్.. ఈవీఎం లెక్కింపులోనూ మొదటి రౌండ్ నుంచే దూసుకుపోయారు. 16 ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగుసార్లు వరుస ఓటములు చవిచూసిన ఆయన.. ఎట్టకేలకు మొదటిసారి విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నవీన్ యాదవ్ నివాసం వద్ద బాణాసంచా పేల్చుతూ సంబరాలు జరుపుతున్నారు.
కాగా ఈ క్రమంలోనే నవీన్ యాదవ్ ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉప ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల వివరాలతో పాటు అప్పులను గురించి కూడా వెల్లడించారు. వాటిని పరిశీలిస్తే.. మొత్తంగా 30 కోట్ల రూపాయల ఆస్తులతో పాటు.. రూ.75 లక్షల మేర రుణాలు ఉన్నట్టు స్పష్టం చేశారు. అలానే తన వద్ద 11 తులాల బంగారు ఆభరణాలు ఉండగా.. ఆయన భార్య వద్ద 2 కిలోల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి ఉందని పేర్కొన్నారు. వారి కుమారుడి పేరిట 15 తులాల బంగారం ఉందని వివరించారు.

2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం నవీన్ యాదవ్‌కు రూ.17.5 కోట్లకుపైగా ఆస్తులు ఉండగా.. రూ.85 లక్షల మేర అప్పులు ఉన్నాయి. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమార్తె వర్షను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
నవీన్ యాదవ్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
యాదవ్ అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు సుమారు రూ. 30 కోట్లు
పెట్టుబడులు:
కస్తూరి నవీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్.
నవీన్ ప్రవీణ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్.
వైజేఆర్ ఇన్‌ఫ్రా అండ్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ.
వీటితో పాటు సంగారెడ్డి, మెడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో వ్యవసాయ, అవ్యవసాయ భూములు ఉన్నట్లు వివరించారు.
భార్య వర్షా యాదవ్ ఆస్తులు..
మొత్తం ఆస్తులు: సుమారు రూ.8 కోట్లు
బంగారం: రూ.2.2 కోట్లు
వెండి: రూ.22.75 లక్షలు విలువ
అప్పులు..
యాదవ్ దంపతుల మొత్తం అప్పులు రూ. 75 లక్షలు ఉన్నాయి.
నవీన్ యాదవ్ (FY 2024-25): రూ. 19.51 లక్షలు
వర్షా యాదవ్ (FY 2023-24): ₹7.82 లక్షలు
ఇద్దరి ఆదాయంలో గత కొన్నేళ్లుగా స్థిరంగా వృద్ధి కనిపిస్తోంది.
మరోవైపు అఫిడవిట్ ప్రకారం.. అలాగే తనపై 7 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్‌కు తెలియజేశారు. నవీన్ యాదవ్‌పై జూబ్లీహిల్స్ పరిధిలో 2021లో కేసులు నమోదయ్యాయి. 2025 ఉప ఎన్నిక సమయంలో ఓటర్లను ప్రలోభపర్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో ఆయనపై మధురానగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications