అబ్బాయిలకి అమ్మాయిల నెంబర్లిచ్చిన సీనియర్ గర్ల్స్: రిషికేశ్వరి విచారణలో షాకింగ్
గుంటూరు: రిషికేశ్వరి ఆత్మహత్య పైన బాలసుబ్రహ్మణ్యం కమిటి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో పలు షాకింగ్ విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ విద్యార్థులతో ప్రిన్సిపల్ బాబురావు చెట్టాపట్టాల్ వేసేవాటని, అందుకే వారు రెచ్చిపోయారని వెల్లడైంది.
సీనియర్ విద్యార్థులతో బాబురావు చనువుగా ఉండటం, కళాశాలలో ర్యాగింగ్‌కు ఊతమిచ్చేలా వేళ్లూనుకుపోయిన పరిస్థితులే రిషికేశ్వరి మృతికి కారణమని విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.
జూనియర్లను దారుణంగా అవమానించేవారు. సున్నిత మనస్కురాలైన రిషికేశ్వరి దీనిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపల్ సీనియర్ విద్యార్థులతో అత్యంత చనువుగా ఉండేవాడు. ఈ కారణంగా జూనియర్లు ర్యాగింగ్ విషయమై ఫిర్యాదు చేసేందుకు భయపడేవారు.

కొన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదని తెలుస్తోంది. సీనియర్ అమ్మాయిలు.. కొంతమంది జూనియర్ అమ్మాయిల ఫోన్ నెంబర్ తీసుకొని సీనియర్ అబ్బాయిలకు ఇచ్చేవారు. జూనియర్ అమ్మాయిలు జూనియర్ అమ్మాయిలు బస్సు దిగినప్పటి నుంచి తరగతి గదికి వెళ్లే వరకు ర్యాగింగ్ చేసేవారు.
అంతర్గత మార్కుల కారణంగా ర్యాగింగ్, ఇతర వేధింపులపై జూనియర్ విద్యార్థినులు ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఉందని తేలిందని తెలుస్తోంది. రాత్రిపూట తరగతులు జరిగినప్పుడు ర్యాగింగ్ జరిగేది. అక్కడ పలువురు మద్యం తాగేవారు.
రిషికేశ్వరి మృతికి కొన్నేళ్ల ముందు నుంచే ఆర్కిటెక్చర్ కళాశాలలో ర్యాగింగ్ వేళ్లూనుకుపోయింది. అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండేవారు. అధ్యాపకులు అందరూ తాత్కాలిక ఉద్యోగులవడం వల్ల భయం బోధన పట్ల అంకిత భావం లేకుండా పోయింది.
పలు సందర్భాల్లో జూనియర్లను వేధించి అందుకు సంబంధించిన వీడియోలను వాట్సప్‌లో ఉంచేవారు. కళాశాలలోకి రావడం, పోవడంకు సంబంధించి నమోదు చేసే పుస్తకం లేదు. ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా తెలియని పరిస్థితి.
రిషికేశ్వరి మధ్యాహ్నం పన్నెండున్నరకు ఆత్మహత్య చేసుకున్నా రాత్రి ఎనిమిదిన్నర వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రెషర్స్ డే పార్టీలో ప్రిన్సిపల్ మద్యం తాగారు. కులసంఘాలు నిషేధించాలని విద్యార్థులు కమిటీకి వెల్లడించారు.












Click it and Unblock the Notifications