కేసీఆర్ పుట్టినరోజున నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఆపగలిగా: కేఏ పాల్

కేసీఆర్ పుట్టినరోజున నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఆపగలిగానని కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ భవన ప్రారంభోత్సవం కెసిఆర్ పుట్టినరోజు నాడు జరుగుతుందని అందరూ భావిస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇక ఈ నేపధ్యంలో మళ్లీ మరొక తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే ఈ మేరకు ఈ నెల 17 న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. వారినుంచి వచ్చిన ప్రతి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో.. ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. తదుపరి తేదీని తిరిగి ప్రకటించడం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే సెక్రటేరియట్ బిల్డింగు ప్రారంభోత్సవాన్ని తానే ఆపినట్టుగా కేఏ పాల్ నేడు వ్యాఖ్యలు చేశారు.

K.A.Paul interesting comments on postponement of inauguration of new secretariat on KCRs birthday

సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం కేసీఆర్ బర్త్ డే రోజు ప్రారంభం కాకుండా ఆపగలిగాను అని పేర్కొన్న ఆయన, ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 14 రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కెసిఆర్ పుట్టినరోజు నాడు సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించకుండా న్యాయ పోరాటం చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై హైకోర్టులో పిల్ వేసి మరీ పోరాటం చేశాను అన్న కేఏ పాల్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి కూడా తాము ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

ఇక ఈ కారణాలతోనే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీన సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసింది అని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ తన తప్పును ఒప్పుకోకపోయినా, ఎన్నికల కోడ్ తీసుకొచ్చి వాయిదా వేసామని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ నూతన సెక్రటేరియట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని పేర్కొన్న కేఏ పాల్, అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+