వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ ఎంపి కేకేకు అస్వస్థత: నిమ్స్‌కు తరలింపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మంగళవారం ఛాతి నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు.

గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా, కేశవరావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

అనంతరం తెంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్‌లో కేశవరావుకు టిఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆయనకు పార్టీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

K Keshava Rao hospitalised in Hyderabad

పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హరీష్‌రావు

మెదక్: సిద్ధిపేట మండలం పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమయ పాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న సమస్యలను మంత్రి హరీశ్ రావు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

English summary
TRS MP K Keshava Rao was admitted to hospital for chest pain in Hyderabad on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X