వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో వార్ వన్ సైడే.. టీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీల డిపాజిట్లు గల్లంతే: కేఏపాల్ షాకిచ్చారుగా!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకొని ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నిక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడు లో జెండా ఎగురవేయాలని, మునుగోడు విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ మాత్రం తగ్గకుండా కే ఏ పాల్ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. మునుగోడు లో గెలిచేది నేనే అంటూ కే ఏ పాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మునుగోడులో ఎన్నికల ప్రచారంలో జోరుగా కేఏ పాల్

మునుగోడులో ఎన్నికల ప్రచారంలో జోరుగా కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం లో జోరుగా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, అభివృద్ధి ఆ రాజకీయ పార్టీలతో సాధ్యం కాదని, తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మునుగోడును అభివృద్ధి చేస్తానని, యువత అందరికీ ఉద్యోగాలు ఇస్తానని, మునుగోడు అమెరికా చేస్తానని ఇప్పటికే మాట ఇచ్చిన కే ఏ పాల్ దీపావళి పండుగ సందర్భంగానూ నియోజకవర్గంలో హడావుడి చేశారు.

దీపావళికి స్వీట్లు పంచి హంగామా చేసిన కేఏ పాల్

దీపావళికి స్వీట్లు పంచి హంగామా చేసిన కేఏ పాల్


మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కే ఏ పాల్ స్థానికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి వారందరికీ స్వీట్లు పంచారు. టీ పెట్టి ప్రజలందరికీ టీ తాగించారు. స్థానికంగా ఉన్న ఒక సెలూన్ షాప్ కి వెళ్లి కటింగ్ చేయించుకొని, అక్కడ వారితో మాట్లాడి హంగామా చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో కే ఏ పాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. మునుగోడులో తనను గెలిపిస్తే 60 నెలల్లో చేయలేని అభివృద్ధిని ఆరు నెలల్లో చేసి పడేస్తా అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆరునెలల్లో మండలానికి ఒక కాలేజ్, ఉచిత ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం అన్నారు. ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇచ్చి ఆరు నెలల్లో మునుగోడు అమెరికా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

మునుగోడులో ఆ మూడు పార్టీలకు డిపాజిట్ రాదు

మునుగోడులో ఆ మూడు పార్టీలకు డిపాజిట్ రాదు


మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తనకే మద్దతు ఇస్తున్నట్లుగా కేఏపాల్ చెప్పుకొచ్చారు. మునుగోడులో ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావని తేల్చిచెప్పారు. మునుగోడులో వార్ వన్ సైడే అని పేర్కొన్న కే ఏ పాల్ ప్రజలందరు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించడానికి రెడీగా ఉన్నారన్నారు. మునుగోడులో ప్రజలు 60 శాతం ఆల్రెడీ డిసైడ్ అయ్యారని, వారంతా తన వెనకే ఉన్నారని, తనను గెలిపించడానికి వారు నిర్ణయం తీసుకున్నారని కేఏపాల్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు అందరూ తనకు ఓటు వేయాలన్న కేఏ పాల్

కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు అందరూ తనకు ఓటు వేయాలన్న కేఏ పాల్


ఇక తమ ఎన్నికల ప్రచారాన్ని టిఆర్ఎస్ గుండాలు, కాంగ్రెస్ గుండాలు అడ్డుకున్నారంటూ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు అందరూ తనకు ఓటు వేయాలని కే ఏ పాల్ విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు అందరూ తన కేఏపాల్ యాప్ లోలాగిన్ అవ్వమని చెప్పిన ఆయన, అలాగే ఆ యాప్ ని షేర్ చేయమని కోరారు. కుల, కుటుంబ, అవినీతి పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టి మన మునుగోడు అభివృద్ధి చేసుకుందాం అంటూ కే ఏ పాల్ పిలుపునిచ్చారు.

కేఏ పాల్ ఎన్నికల ప్రచారంతో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్

కేఏ పాల్ ఎన్నికల ప్రచారంతో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్

ఇతర పార్టీల నుంచి వచ్చి చెబుతున్న రాజకీయ నాయకుల ప్రచారాన్ని, దొంగ మాటలను ఎవరూ నమ్మవద్దని కే.ఏ పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావు అని, వార్ వన్ సైడే ఉంటుందని కె ఏ పాల్ చేస్తున్న ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలోని ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

English summary
In munugode, KAPal made shocking comments that war is one sided, 60 percent of voters are with him, TRS, Congress and BJP's deposits are guaranteed to be lost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X