పవన్ కళ్యాణ్ ఆ పనిచేస్తే గెలిపిస్తా.. లేదంటే వెయ్యి కోట్లిస్తా: కేఏ పాల్ సంచలనం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే వ్యక్తి కే ఏ పాల్ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. కె ఏ పాల్ పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని వదిలిపెట్టి ప్రజాశాంతి పార్టీ లో చేరితే ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో గెలిపిస్తానని కే ఏ పాల్ తేల్చిచెప్పారు. గెలిపించలేకపోతే వెయ్యి కోట్ల నజరానా ఇస్తానని కె ఏ పాల్ స్పష్టం చేశారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసినా, మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని కె ఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు లో ఉండి బైబిల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కే ఏ పాల్ పేర్కొన్నారు. ఇప్పటికే 42 ఎంపీ సీట్లు తానే గెలుస్తాను అని పేర్కొన్న కె ఏ పాల్, హైదరాబాదు తప్ప తమ పార్టీకి మిగతా చోట్ల సీట్లు వస్తాయని వ్యాఖ్యలు చేశారు. తాను దేశానికి ప్రధానమంత్రి అవుతానని, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవులను పంచేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కె ఏ పాల్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులంతా ప్రజా సేన పార్టీకి ఓటేయాలని కేఏ పాల్ తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై, పొత్తుల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు.
ఇక ఇదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ను ఓసారి సీఎం చేస్తానని, మరోసారి ఎంపీ చేస్తానని కె ఏ పాల్ చేస్తున్న ప్రకటనలతో అటు ప్రజా సేన పార్టీ నాయకులు, కె ఏ పాల్ అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.












Click it and Unblock the Notifications