కాచిగూడ ప్రయాణికులకు బిగ్ అలర్ట్-ఈ తేదీల్లో ఈ రైళ్లన్నీ..!
హైదరాబాద్ లోని కాచిగూడ (Kacheguda) రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఈ నెలలో కాచిగూడ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసింది. దీంతో ఆయా రైళ్లలో ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకున్న వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే మొత్తం 12 రైళ్లు పలు తేదీల్లో రద్దయ్యాయి.
కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్లే రైలు నంబర్ 67781ను ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రద్దు చేశారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకు ప్రయాణించే రైలు నంబర్ 67782ను కూడా ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకూ రద్దు చేశారు. కాచిగూడ నుంచి రాయచూర్ కు వెళ్లే రైలు నంబర్ 67787ను ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకూ రద్దు చేశారు. రాయచూర్ నుంచి కాచిగూడకు ప్రయాణించే రైలు నంబర్ 67788ను ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకూ రద్దు చేశారు.

అలాగే బోధన్ నుంచి కాచిగూడకు ప్రయాణించే రైలు నంబర్ 57414ను ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ రద్దు చేశారు. కాచిగూడ నుంచి గుంతకల్ కు ప్రయాణించే రైలు నంబర్ 57412ను ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ రద్దు చేశారు. అలాగే కాచిగూడ నుంచి కర్నూలు సిటీకి ప్రయాణించే రైలు నంబర్ 17435ను ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రద్దు చేశారు. దీంతో పాటు కర్నూలు సిటీ నుంచి కాచిగూడకు ప్రయాణించే రైలు నంబర్ 17436ను ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ రద్దు చేశారు.

అలాగే కాచిగూడ-రాయచూర్ రైలు నంబర్ 17693ను ఈ నెల 12 నుంచి 17 వరకూ, రాయచూర్-కాచిగూడ రైలు నంబర్ 17694ను ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకూ రద్దు చేశారు. కాచిగూడ-మహబూబ్ నగర్ రైలు నంబర్ 77641ను ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రద్దు చేశారు. మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ ప్రయాణించే రైలు నంబర్ 77642ను ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రద్దు చేశారు.












Click it and Unblock the Notifications