
ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు.. 12గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు; రెడ్ అలెర్ట్!!
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇక ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వరద నీటితో ప్రాజెక్టు నిండుకుండల గా మారింది. ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరుకుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్
ప్రస్తుతం కడెం ప్రాజెక్టు కు 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో 17 గేట్లను ఎత్తి వేసిన అధికారులు సుమారు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు పంపిస్తున్నారు. వరద ఇదే విధంగా కొనసాగితే డ్యామ్ తెగే ప్రమాదం ఉందని ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రాజెక్టు పరిధిలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు
కడెం, కన్నాపూర్, దేవుని గూడెం, మున్యాల్, గోడిషిరియాల్, రాపర్ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కడెం ప్రాజెక్టు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. కడెం ప్రాజెక్టు వద్ద నేనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు రాత్రంత ప్రాజెక్టు వద్ద నుండి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రాజెక్టు పరిధిలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు.
రెడ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు.. 17 గేట్ల ఎత్తివేత
కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ప్రమాదకరస్థాయిలో వస్తుండటంతో, అదే స్థాయిలో ఔట్ ఫ్లో లేకపోవడంతో అధికారులు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. మొత్తం ప్రాజెక్టు 18 గేట్లు లో ఒక గేటు తెరుచుకోకపోవడంతో, మొత్తం 17 గేట్లను తెరిచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరింది7. 603 టీఎంసీలకు గాను 7.603 టిఎంసీలకు వరద నీరు చేరడంతో ప్రస్తుతం ప్రమాదపు అంచున కడెం ప్రాజెక్టు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో ప్రస్తుతం 5లక్షల క్యూసెక్కులుగా ఉంది.