వరంగల్ ఎంపీ: బరిలో కడియం కావ్య, ఏం చేస్తుంటారు? (ఫోటోలు)
హైదరాబాద్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ స్ధానానికి రాజీనామా చేయడంతో ఆ స్ధానానికి జరగబోయే ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన కూతురు డాక్టర్ కడియం కావ్యను బరిలోకి దించే ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు డిప్యూటీ సీఎం పదవి వరించడం... ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలల్లో గెలుపొందడం చకా చకా జరిగిపోయాయి. ఎమ్మెల్సీగా ఎన్నికవగానే ఆయన వరంగల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు.
దీంతో ఈ స్ధానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఎవరిని దింపాలని టీఆర్ఎస్ అంతర్గతంగా కసరత్తు చేసినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ వివిధ మార్గాలు, నిఘా వర్గాల నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థికోసం సమాచారం తెప్పించుకోగా, అందులో కడియం శ్రీహరి కూతురు కావ్య బలమైన అభ్యర్థిగా తేలినట్టు తెలిసింది.

వరంగల్ ఎంపీ బరిలో కడియం కావ్య?
వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో పార్టీలో ఈ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నేతలు లేకపోవడంతో కడియం శ్రీహరి కూతురు కావ్య అభ్యర్థిత్వానికి సీఎం కేసీఆర్ మొగ్గు చూపిస్తున్నట్టు తెలిసింది.

వరంగల్ ఎంపీ బరిలో కడియం కావ్య?
ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి పార్టీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆసక్తిగా ఉన్నప్పటికీ వారంతా స్థానికులు కాకపోడవంతో కావ్యకు కలిసొచ్చింది.

వరంగల్ ఎంపీ బరిలో కడియం కావ్య?
ఇది ఇలా ఉంటే వరంగల్ ఎంపీగా తన కూతురు కావ్య ఎంపిక దాదాపు ఖరారవడంతో కడియం శ్రీహరి ఉప ఎన్నికల్లో గెలుపించుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. కడియం శ్రీహరికి ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురు కావ్య.













Click it and Unblock the Notifications