బీఆర్ఎస్ తాజా పరిస్థితిని సెలవిచ్చిన కడియం శ్రీహరి!!
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఇలా ప్రస్తుత పరిస్థితిని వెల్లడించారు కడియం శ్రీహరి. పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. అందుకే తాము తప్పనిసరి స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు.
ప్రజల మేలు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిన క్రమంలోనే తాను ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు కడియం శ్రీహరి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమను పార్టీ స్టేట్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఆహ్వానించారని, తమ సహచరులు, కార్యకర్తలతో చర్చించిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని, తాము ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమైన కడియం శ్రీహరి వారితో చర్చలు జరిపారు. వారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని, తమ రాక పట్ల వారు చాలా ఉత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేక కేసులతో అభాసుపాలు అయిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. పార్టీలో ముఖ్య నాయకులు ఎవరు ఉండే పరిస్థితి లేదన్నారు. చాలా మంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తండ్రి తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని తాను అభ్యర్థిగా తప్పుకుంటున్నానని కెసిఆర్ కు లేఖ రాసి వెళ్లిపోయిన కడియం కావ్య కూడా తండ్రి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. నేడు కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది.
కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ హై కమాండ్ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతున్నారు. ఒక్క కడియం శ్రీహరి మాత్రమే కాదు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మితో సహా కాంగ్రెస్ బాట పట్టారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications