హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడ్తాల్ ఫాంహౌస్ పార్టీ-విద్యార్థులు,టెక్కీలే టార్గెట్‌గా-మందు,చిందు,డ్రగ్స్-విస్తుపోయే అంశాలు

|
Google Oneindia TeluguNews

ఇటీవల హైదరాబాద్ శివారులోని కడ్తాల్‌లో ఉన్న ఓ ఫాంహౌస్‌లో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీకి సంబంధించి పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. వరుణ్ గౌడ్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుక పేరుతో దీన్ని ఏర్పాటు చేసినట్లు మొదట పోలీసులు గుర్తించారు. కానీ అది పుట్టినరోజు ముసుగులో జరిగిన 'దావత్' అని తాజాగా తేల్చారు. నిజానికి వరుణ్ గౌడ్ ఎవరో కూడా ఆ పార్టీలో పాల్గొన్న చాలామందికి తెలియదని గుర్తించారు.లాక్‌డౌన్ నేపథ్యంలో పబ్బులన్నీ మూతపడటంతో... కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఇలా నగర శివారుల్లోని ఫాంహౌస్‌లలో మందు,చిందు,విందు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ధారించారు.

Recommended Video

#TOPNEWS: AP 10th And Inter Exams| Kadtal Farmhouse|Vizag Steel Plant Privatization| Oneindia Telugu
మందు,చిందు,డ్రగ్స్...

మందు,చిందు,డ్రగ్స్...

కడ్తాల్‌ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నవారిలో 68 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వాహకుల్లో ఒకరైన జీషన్ అలీఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పార్టీకి సంబంధించిన ప్రకటనలు చేసినట్లు గుర్తించారు. దీంతో సోషల్ మీడియా ద్వారానే చాలామంది అతన్ని సంప్రదించి పార్టీకి వచ్చినట్లు తేల్చారు.మందు,చిందు,డ్రగ్స్ సప్లై ఉంటుందని చెప్పి... ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు మేర వసూలు చేసినట్లు గుర్తించారు.

అతనెవరో తెలియదని...

అతనెవరో తెలియదని...

కడ్తాల్ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నవారిని పోలీసులు విచారించగా... చాలామంది వరుణ్ గౌడ్ ఎవరో తమకు తెలియదని చెప్పారు. దీంతో అది పుట్టినరోజు వేడుక కాదని పోలీసులు నిర్దారణకు వచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ పబ్బులన్నీ మూతపడటంతో ఈవెంట్ ఆర్గనైజర్లు,కొంతమంది వ్యక్తులు కలిసి ఇలాంటి పార్టీలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం నగర శివార్లలోని ఫాంహౌస్‌లను ఎంచుకుని విద్యార్థులు,సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తేల్చారు.

ఇద్దరూ ఒక్కరేనా...?

ఇద్దరూ ఒక్కరేనా...?

కడ్తాల్ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీ నిర్వాహకుల్లో ఒకరైన జీషన్ అలీఖాన్ పేరు గతంలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ కేసులో వినిపించింది. అయితే అతనే ఇతనా అన్నది తేలాల్సి ఉంది. జీషన్ అలీఖాన్ అలియాస్ జాక్‌పై గతంలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. 2016లో బహదూర్ పురా పోలీస్ స్టేషన్‌లో నకిలీ సర్టిఫికెట్ కేసు,2018లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రేప్ కేసు నమోదైనట్లు గుర్తించారు. 2017లో ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ కేసులోనూ జాక్ పేరు ప్రముఖంగా వినిపించింది. నగరంలో జరిగే పార్టీలకు జాక్ డ్రగ్స్ విక్రయించేవాడని గుర్తించారు. జీషన్ అలీఖాన్,జాక్ ఒక్కరేనా.. ఇద్దరూ వేర్వేరా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఒక్కరే అని తేలితే జీషన్ అలీఖాన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

English summary
Police have registered cases against 68 people who took part in the party at Kadtal Farmhouse. Zeeshan Ali Khan, one of the party's organizers, was found to have made posts about the party via Instagram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X