ముప్పు తప్పింది.. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన కాకతీయ ప్యాసింజర్!

పైలట్ మద్యం సేవించినందువల్లే సిగ్నల్ క్రాస్ చేసి ఉంటాడన్న అనుమానంతో అతనికి బ్రీత్ అనలైజర్ టెస్టులు కూడా నిర్వహించారు.

జనగాం: ఈ ఉదయం జనగామ వద్ద కాకతీయ ప్యాసింజర్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి ముందుకెళ్లడం రైల్వే అధికారుల్లో టెన్షన్ క్రియేట్ చేసింది. ఓవైపు రెడ్ సిగ్నల్ కనిపిస్తున్నా.. డ్రైవర్ మాత్రం రైలును సిగ్నల్ దాటించడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

అప్రమత్తమైన అధికారులు అక్కడిక్కడే రైలును నిలిపేశారు. పైలట్ మద్యం సేవించినందువల్లే సిగ్నల్ క్రాస్ చేసి ఉంటాడన్న అనుమానంతో అతనికి బ్రీత్ అనలైజర్ టెస్టులు కూడా నిర్వహించారు.

kakatiya passenger crossed red signal at janagaon

అతనితో పాటు అసిస్టెంట్ డ్రైవర్ కు కూడా బ్రీత్ అనలైజింగ్ టెస్టులు నిర్వహించారు. అయితే పైలట్ మాత్రం తాను మద్యం సేవించలేదని, సిగ్నల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే రెడ్ సిగ్నల్ క్రాస్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాకతీయ ప్రయాణికులను భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ద్వారా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+