కరోనా కంటైన్మెంట్ జోన్ గా కాళేశ్వరం .. ప్రజలకు అధికారుల విజ్ఞప్తి
కాళేశ్వరం లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. కాళేశ్వరం దేవస్థాన దర్శనం, ప్రాజెక్టు సందర్శన మరియు అస్తికలు కలపటం వంటి క్రతువులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గత కొన్ని రోజుల నుండి మరలా కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న క్రమంలో కేవలం కాళేశ్వరం గ్రామంలోనే 50కి పైన పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా కరోనా కట్టడి లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య కాళేశ్వరం గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు . కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, గ్రామస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ఎవరూ కాళేశ్వరం సందర్శనకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాళేశ్వరం దేవస్థానం కు వచ్చే భక్తులు గాని, ప్రాజెక్టు సందర్శనకు వచ్చే యాత్రికులు గాని మరియు అస్తికలు కలుపుటకు వచ్చే వారుగాని ఇక్కడి కరోనా తీవ్రత తగ్గి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పై విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను వాయిదా వేసుకుని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహమ్మారి కట్టడి లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని , అధికార యంత్రాంగం సూచనలతో కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications