వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణ కు ఓ మ‌కుటాయ‌మానం..!! 2018లో అద్బుత నిర్మాణం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ కల సాకారం ఐన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు నేత్రుత్వంలో కోటి ఎక‌రాల‌కు సాగునీరు అందివ్వ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్మిత‌మ‌వుతున్న బ్రుహ‌త్క‌ర నిర్మాణం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్. ప్రాజెక్టు మొద‌టి ద‌శ నిర్మాణంలో అనేక స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్ప‌టికి తెలంగాణ ప్ర‌భుత్వం చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి అన్ని అవ‌రోదాల‌ను అదిగ‌మించ‌గ‌లిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 65శాతం పనులు పూర్తి చేసుకున్న ఈ ప్ర‌జెక్టు మ‌రో యేడాది కాలంలో పూర్తి కాబోతోంది. దీంతో తెలంగాణ‌లోని దాదాపు 25జిల్లాల‌కు సాగుతో పాటు త్రాగునీటికి ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దని తెలంగాణ భారీ నీటిపారుద‌ల శాఖ మాజీ మంత్రి హ‌రీష్ రావు తెలియ‌జేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ గ్రామాలు స‌శ్య‌శ్యామ‌లం అవ్వ‌డం ఖాయ‌మ‌నే భ‌రోసాను ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ స‌శ్య‌శ్యామ‌లం కావాల‌ని నిర్మిస్తున్న ప్రాజెక్టే కాళేశ్వ‌రం..! మ‌రో యేడాదిలో పూర్తి..!!

తెలంగాణ స‌శ్య‌శ్యామ‌లం కావాల‌ని నిర్మిస్తున్న ప్రాజెక్టే కాళేశ్వ‌రం..! మ‌రో యేడాదిలో పూర్తి..!!

గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ... రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్తగా సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం చేపట్టిన భూసేక‌ర‌ణ క్లిష్టంగా మారింది. అక్క‌డి నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు. నిర్మాణ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టుకు ఊహించని స్థాయిలో పేరొచ్చింది. దీంతో ఇది పర్యటక ప్రాంతంగానూ మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలేంటి? ఇతర సాగు నీటి ప్రాజెక్టులకు మించి దీనికున్న ప్రత్యేకతలు ఏమిటి? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

కాళేశ్వరం: అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ.80వేల కోట్ల అంచనా కాళేశ్వరం: అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ.80వేల కోట్ల అంచనా

ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ‌కు నీటి క‌ష్టాలు ఉండ‌వు..! శ‌ర‌వేగంగా నిర్మాణం..!!

ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ‌కు నీటి క‌ష్టాలు ఉండ‌వు..! శ‌ర‌వేగంగా నిర్మాణం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్న‌వే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌భుత్వం రీడిజైన్ చేయించింది. ముందుగా అనుకున్న‌ట్టు ప్రాణ‌హిత న‌దిపై కాకుండా కాస్త కింద‌కు, ప్రాణ‌హిత న‌ది గోదావ‌రిలో క‌లిసిన త‌రువాత‌ ప్ర‌ధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు.
ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. తెలంగాణ- మ‌హారాష్ట్ర స‌రిహద్దుల్లోని గోదావ‌రి నుంచి ద‌క్షిణాన హైద‌రాబాద్, చిట్యాల‌, షామీర్‌పేట వ‌ర‌కు నీళ్లొచ్చేలా ఈ కొత్త‌ డిజైన్ ఉంది.

ఖర్చును లెక్క‌చేయ‌ని ప్ర‌భుత్వం..! తెలంగాణ ప‌ల్లెల ప‌చ్చ‌ద‌న‌మే ల‌క్ష్యం..!!

ఖర్చును లెక్క‌చేయ‌ని ప్ర‌భుత్వం..! తెలంగాణ ప‌ల్లెల ప‌చ్చ‌ద‌న‌మే ల‌క్ష్యం..!!

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మ‌డి 10 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు, హైద‌రాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు. కొత్త ఆయ‌కట్టు కాకుండా శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయ‌ర్ మానేరు, అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టుల‌ను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించ‌డానికి కొత్త‌గా కాలువ‌లు, సొరంగాలు, పంపు హౌజులు త‌వ్వారు. వీటి ద్వారా మిగిలిన నీటిని త‌ర‌లించి ఆయ‌క‌ట్టును స్థిరీక‌రిస్తారు. అంటే ఆ రిజ‌ర్వాయ‌ర్ల కింద ఉన్న 18.82 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నిక‌రంగా నీరందించ‌వ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. వీటికి అద‌నంగా, పాత ప్రాణ‌హిత ప్రాజెక్టు ప్ర‌తిపాదించిన చోటే అప్ప‌టికంటే ఎత్తు త‌గ్గించి మ‌రో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 ల‌క్ష‌ల ఎక‌రాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అవాంత‌రాలు..! అన్నీ అదిగ‌మించిన తెలంగాణ పర‌భుత్వం..!

ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అవాంత‌రాలు..! అన్నీ అదిగ‌మించిన తెలంగాణ పర‌భుత్వం..!

న‌దిలో నీటి ప్ర‌వాహాన్ని ఆపడానికి క‌ట్టే నిర్మాణాన్ని బ్యారేజ్ అంటారు. న‌దిలోనే జ‌లాశ‌యం కూడా నిర్మిస్తే డ్యామ్ అంటారు. (ఉదాః నాగార్జున సాగ‌ర్ డామ్, ప్ర‌కాశం బ్యారేజ్). ఇప్పుడు గోదావ‌రిపై మూడు చోట్ల (మేడిగ‌డ్డ‌, సుందిళ్ల‌, అన్నారం) బ్యారేజ్‌లు క‌డుతున్నారు. ఒక బ్యారేజ్‌లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మ‌రో బ్యారేజ్ ముందుకు వ‌దిలేలా ఏర్పాటు ఉంటుంది. (గోదావ‌రి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో, ఎగువ‌కి) ఇలా మేడిగ‌డ్డ నుంచి ఎల్లంప‌ల్లి వ‌ర‌కూ నీటిని తెస్తారు.

అక్క‌డి నుంచి కాలువ‌ల ద్వారా నీటిని పంపిస్తారు. అలా నీరు సొరంగాలు, కాలువ‌ల్లో ప్ర‌వ‌హించి, పంపుహౌజుల్లో లిఫ్టు చేసి భూమి లోప‌ల‌, బ‌య‌ట ప్ర‌యాణించి వేర్వేరు కొత్త, పాత జ‌లాశ‌యాలను క‌లుపుతూ ద‌క్షిణ తెలంగాణ వ‌ర‌కూ వ‌స్తుంది. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే అవ‌స‌రానికి అనుగుణంగా గోదావ‌రి నీటిని కాలువ‌లోకి మ‌ళ్లించి, గోదావ‌రి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో (వెన‌క్కు) తీసుకెళ్లి మ‌ళ్లీ గోదావ‌రిలోనే క‌లుపుతారు. ఇదంతా కాళేశ్వ‌రం లింక్ -1 లో జ‌రుగుతుంది.

అక్క‌డి నుంచి కాలువ‌ల ద్వారా అనుకున్న చోటుకు త‌ర‌లిస్తారు. ఇందుకోసం వివిధ చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పాత చెరువులు, రిజ‌ర్వాయ‌ర్ల‌ను, కాలువ‌ల‌ను బాగు చేశారు. మరికొన్ని చోట్ల కొత్త‌గా కాలువ‌లు, సొరంగాలు, పంపు హౌజులు, రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించారు. ఈ మొత్తం ప‌నిని లింకులుగా, తిరిగి ఆ లింకుల‌ను ప్యాకేజీలుగా విభ‌జించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 7 లింకులు 28 ప్యాకేజీలు ఉన్నాయి.

స‌ర్వం సిద్దం..! తెలంగాణ గ్రామాల‌కు గోదారి గ‌ల‌గ‌ల‌లే త‌రువాయి..!!

స‌ర్వం సిద్దం..! తెలంగాణ గ్రామాల‌కు గోదారి గ‌ల‌గ‌ల‌లే త‌రువాయి..!!

ప్ర‌స్తుతం లింక్ 1, లింక్ 2 ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. లింక్ 1, లింక్ 2 ల‌లో మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటికి అనుబంధంగా ఉండే పంపుహౌజులు, ధ‌ర్మారం, రామ‌డుగు గ్రామాల ద‌గ్గ‌ర్లో భూగ‌ర్భంలో నిర్మిస్తోన్న పంపుహౌజులు ఉంటాయి. తాత్కాలిక రాజ‌కీయ ల‌బ్ధి కోసం కాకుండా దీర్ఘ కాలిక ప్ర‌యోజ‌నం కోసమే భారీ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు తెలంగాణ నీటి పారుద‌ల శాఖ మంత్రి టి.హ‌రీశ్ రావు అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన వ‌న్ ఇండియా తెలుగుతో మాట్లాడుతూ "తెలంగాణలో గోదావ‌రి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కూ నీటిని ఎత్తిపోయ‌డం త‌ప్ప వేరే గత్యంత‌రం లేదు. అందుకే ఇంజినీర్లు, మేధావులు, నీటిపారుదల శాఖతో సీఎం కేసీఆర్ తీవ్రంగా చ‌ర్చించి కాళేశ్వ‌రం డిజైన్ రూపొందించారు.

గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల నీరు తెచ్చి తెలంగాణ‌ను స‌శ్య‌శ్యామ‌లం చేయాల‌న్న ఆలోచ‌న‌తో ప‌నిచేస్తున్నాం'' అని తెలిపారు. భ‌విష్య‌త్తులో అవ‌స‌రమనుకుంటే మరో టీఎంసీ నీటిని తోడ‌టానికి వీలుగా కావ‌ల్సిన సివిల్ వ‌ర్క్స్ ఇప్పుడే చేసి పెట్టామని, అవ‌స‌రమైతే కృష్ణా పరివాహ‌క ప్రాంతానికి కూడా నీరు పంప‌డానికి ఆటోమేటిగ్గా మూడో పంపు బిగించేయ‌వ‌చ్చని హ‌రీశ్ రావు చెప్పారు.

నిర్వాసితుల అభ్యంతరాలు..! ఒప్పించిని ప్ర‌భుత్వం..!

నిర్వాసితుల అభ్యంతరాలు..! ఒప్పించిని ప్ర‌భుత్వం..!

ఈ ప్రాజెక్టు మిగిలిన ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ కంటే సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణ చాలా క్లిష్టంగా మారింది. అక్క‌డి నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు. వారు తాజాగా మ‌రోకేసు వేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం కేంద్రం చ‌ట్టం ప్ర‌కారం కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో ద్వారా ఇస్తోంది. దీనిపై ప‌లువురు నిర్వాసితులు అభ్యంత‌రాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాల వ‌ర‌కూ సేక‌రించాల్సి ఉంది.

కాళేశ్వరం కోసం టూరిజం శాఖ ప్ర‌త్యేక ప్యాకేజీ..! అద్బ‌తం అంటున్న నిపుణులు..!!

కాళేశ్వరం కోసం టూరిజం శాఖ ప్ర‌త్యేక ప్యాకేజీ..! అద్బ‌తం అంటున్న నిపుణులు..!!

తెలంగాణ టూరిజం కార్పొరేష‌న్ ఇటీవల ఒక కొత్త టూరిస్ట్ స‌ర్వీస్ ప్రారంభించింది. ఈ ట్రిప్పులో భాగంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యాటకులకు చూపిస్తారు. ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చూపెట్టడానికి టూరిజం కార్పొరేష‌న్ బ‌స్సు న‌డ‌ప‌డం విశేషమే. అంతేకాదు, వివిధ రంగాల‌కు చెందిన వారిని, రాజ‌కీయ, ప్ర‌భుత్వ వ‌ర్గాల వారిని కాళేశ్వ‌రం ప్రాజెక్టు చూసేలా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. అక్క‌డ‌కు వ‌చ్చిన వారికి ఇంజినీర్లు ద‌గ్గ‌ర ఉండి ప్రాజెక్టు నిర్మాణాల గురించి వివ‌రించ‌డం విశేషం..!

ప్రాజెక్టు సాంకేతిక వివరాలు -

ప్రాజెక్టు సాంకేతిక వివరాలు -

నీటి సరఫరా మొత్తం మార్గం: 1832 కి.మీ
మామూలు కాలువల‌ పొడవు: 1531 కి.మీ
సొరంగాలు (భూగ‌ర్భ కాలువ‌లు) పొడ‌వు: 203 కి.మీ
పైపులైన్ పొడ‌వు: 98 కి.మీ
మొత్తం లిఫ్టులు: 20
పంపు హౌజ్‌లు: 19
అవసరమయ్యే విద్యుత్తు: 4627.24 మెగావాట్లు
మొత్తం విద్యుత్ సబ్ స్టేషన్లు: 17
అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం: 139 మెగావాట్ల‌వి 7 పంపులు (రామ‌డుగు వ‌ద్ద‌)
పాత జలాశయాలు: 5 (ఇప్ప‌టికే నిర్మించినవి లేదా స‌హ‌జ‌మైన‌వి)
కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు: 20
మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీలు
13 జిల్లాల్లో వ‌చ్చే కొత్త ఆయ‌క‌ట్టు: 18,25,700 ఎక‌రాలు
శ్రీరాంసాగ‌ర్, నిజాం సాగ‌ర్, సింగూరుల పాత ఆయ‌క‌ట్టు
స్థిరీక‌ర‌ణ: 18,82,970
(18.82 లక్షల ఎకరాల్లో మొత్తంగా 25% నీటి కొరతను పరిగణించి)

కొత్త ఆయకట్టుకు సాగునీరు: 134.5 టీఎంసీలు
శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ఆయకట్టు స్థిరీకరణ:
34.5 టిఎంసిలు
హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా: 30 టీఎంసీలు
దారిపొడవునా ఉండే గ్రామాలకు తాగునీరు: 10 టీఎంసీలు
పారిశ్రామిక అవసరాలకు: 16 టీఎంసీలు
ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం: 225 టీఎంసీలు
ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం భూమి విస్తీర్ణం: 70,326 ఎకరాలు
ఇప్పటిదాకా సేకరించిన భూమి: 36,624 ఎకరాలు
సేకరించవలసిన భూమి: 33,702 ఎకరాలు
మొత్తం అంచ‌నా ఖ‌ర్చు: 80 వేల 500 కోట్లు
బ్యాంకులు ఇస్తోన్న లోన్లు: 18 వేల 800 కోట్లు

English summary
After the Telangana dream, the Wonderful Construction Kaleswaram Project is designed to provide the water for irrigation. Chief Minister Chandrasekhar Rao took this project as prestigious as and completing the project. While the first phase of the project was faced with a lot of problems, the Telangana government was able to sweep away all obstacles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X