ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై భావోద్వేగానికి గురైన కవిత.. షాకింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి చోటు చేసుకుందని, అవినీతిలో కవిత భాగస్వామ్యం అయిందని సిబిఐ నమోదు చేసిన కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నివ్వడంతో కవితకు బిగ్ రిలీఫ్ దొరికింది.
తీవ్ర భావోద్వేగానికి లోనైన కవిత
కవిత పై సిబిఐ నమోదు చేసిన అభియోగాలు అన్నింటినీ కోర్టు కొట్టి వేయడంతో తెలంగాణ జాగృతి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజం గెలిచిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానన్నారు.

మూడేళ్ళు మాటలు పడ్డాను, ట్రోల్స్ భరించాను
నా తల్లిదండ్రులు, అత్తమామలు తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. నాడు కేసీఆర్ ను, టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం పెట్టారని కవిత వ్యాఖ్యలు చేశారు.తనను మూడు సంవత్సరాల పాటు నానా మాటలు అన్నారని, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని కవిత పేర్కొన్నారు. తన కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించామని. కవిత అన్నారు.
కోర్టు తీర్పు రాకుండానే అనుచిత వ్యాఖ్యలు
విపక్షాలను వేధించడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని వెల్లడించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు తన పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని నిరూపితమైందని కవిత వెల్లడించారు. ఇప్పుడు అందరికీ ఆ కేసులో ఏం జరిగిందో క్లారిటీ వచ్చిందన్నారు.
తనకు అండగా ఉన్నవారిని మరచిపోను
తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కవిత, కోర్టు కేసు సమయంలో తనతో అండగా ఉన్న వారిని మరచిపోను అని పేర్కొన్నారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత సత్యమేవ జయతే అని ఎక్స్ లో కవిత పోస్ట్ చేశారు. కవిత ఈ కేసు నుండి బయటపడడం ప్రత్యర్థి పార్టీల నాయకులకు చెంప పెట్టు అని కవిత అనుచరులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications