టీడీపీకి షాక్: రేవంత్ కోసం ఏడ్చిన నేత టీఆర్ఎస్‌లోకి, కేసీఆర్‌తో భేటీ, వారే చక్రం తిప్పారు

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ/హైదరాబాద్: టీడీపీ నల్గొండ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. కంచర్లతో పాటు ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, మరో ముప్పై నలభై మంది నాయకులు ఆయనను కలిశారు.

సేఫ్ గేమ్ ఆడుతున్నారా?: 'రేవంత్ సూపర్, కేసీఆర్! గుణపాఠం నేర్చుకో'

ఇటీవల ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును రేవంత్ అమరావతిలో కలిశారు. రేవంత్ పార్టీ వీడుతున్నట్లు చెప్పిన తర్వాత చంద్రబాబు ఎదుట కంచర్ల భూపాల్ రెడ్డి కంటతడి పెట్టిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్‌లోకి కంచర్ల

టీఆర్ఎస్‌లోకి కంచర్ల

ఇప్పుడు కంచర్ల భూపాల్ రెడ్డి కూడా పార్టీని వీడుతున్నారు. అయితే రేవంత్ కోసం కంటతడి పెట్టిన కంచర్ల నల్గొండలో కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అధికార టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

6న టీఆర్ఎస్‌లోకి కంచర్ల అండ్ కో

6న టీఆర్ఎస్‌లోకి కంచర్ల అండ్ కో

కంచర్ల భూపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో పాటు కేసీఆర్‌ను కలిసిన వారిలో 30 మంది వరకు మండలాధ్యక్షులు, ఇతర నేతలు ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వారిని కేసీఆర్ వద్దకు తీసుకు వచ్చారు. వారు ఈ నెల 6వ తేదీన తెరాసలో చేరే అవకాశముంది.

 వీరే చక్రం తిప్పారు

వీరే చక్రం తిప్పారు

మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు కంచర్ల భూపాల్ రెడ్డితో చర్చలు జరిపి సఫలమయ్యేలా చేశారని తెలుస్తోంది. వారు చక్రం తిప్పడంతో ిక భూపాల్ రెడ్డి తన అనుచరులతో టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

 ఇటీవలే షోకాజ్ నోటీసులు

ఇటీవలే షోకాజ్ నోటీసులు

కంచర్ల భూపాల్ రెడ్డి టీడీపీ నల్గొండ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. ఇటీవ‌లే ఈయన పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party Telangana Leader Kancharla Bhupal Reddy will join TRS on 6 November. He was met Telangana Chief Minister K Chandrasekhar Rao on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి