కర్ణాటక వాల్మీకి స్కామ్ డబ్బులే తెలంగాణ కాంగ్రెస్ వాడింది: కేటీఆర్
కర్ణాటకలో సంచలనంగా మరిన వాల్మీకీ స్కామ్ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో తాము చెప్పిందే నిజమైందన్నారు. ఈ మేరకు వాల్మీకి స్కామ్ పై ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆయన స్పందించారు. కర్ణాటకలోని గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్ర కీలక సూత్రధారి అని ఈడీ ఛార్జ్ షీట్లో నిర్ధారించిందని కేటీఆర్ తెలిపారు. రూ. 187 కోట్ల రూపాయలు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మళ్లించి, ఆ సొమ్మును తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మే 14న జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం ఉపయోగించిందని కేటీఆర్ ఆరోపించారు.

వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిల్డర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలతో సత్యనారాయణ వర్మకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. వ్యాపారాల్లోనూ సత్యనారాయణ వర్మ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారనేది నిర్వివాదమని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్ గురించి నిజాలు నిగ్గుతేల్చాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మేమన్నదే నిజమైంది!
— KTR (@KTRBRS) September 11, 2024
👉 వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడింది!
👉 గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలి!
వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే… https://t.co/ChAF3RLbTq pic.twitter.com/Zroj5089VX
మరో స్కాంకు తెరలేపిన కాంగ్రెస్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో స్కామ్‌కు తెరలేపినట్లు తెలుస్తోందన్నారు కేటీఆర్. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలోని రెండు వేల ఎకరాల అభివృద్ధి పనులను దుబాయిలోని ఎమ్మార్ బిల్డర్స్‌కు అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ ఒప్పందం కోసం 11 ఏళ్లుగా కొనసాగుతున్న బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు కేసు నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మార్ బిల్డర్స్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోందన్నారు.
బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు స్కామ్ కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మార్ ఎంజీఎఫ్ మధ్య జరిగిన వివాదాస్పద ఒప్పందమే కావడం గమనార్హం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మార్ బిల్డర్స్ మధ్య తాజాగా ఒప్పందం జరిగినట్లు వస్తున్న కథనాలపై కేటీఆర్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతుందని అనిపిస్తోందన్నారు. స్కాంగ్రెస్ చేస్తున్న పనులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications