వీడిన కాల్పుల మిస్టరీ: ప్రసాద్‌పై కాల్పులకు తెగబడింది యూపీ ముఠానే

హైదరాబాద్: నగరంలో కలకలం సృష్టించిన కాటేదాన్ కాల్పుల వ్యవహారం మిస్టరీ వీడింది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠా డబ్బుల దోపిడీ కోసమే మనీ ట్రాన్స్‌ఫర్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రసాద్‌పై నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

స్థానికంగా ఓ బిస్కెట్‌ కంపెనీలో పనిచేస్తున్న రాహుల్‌ అతని ఇద్దరు అనుచరులు నాటు తుపాకీని ఉత్తర్‌ప్రదేశ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. .దోపిడీ కోస‌మే వారు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు తుపాకీతో ఎవరినైనా బెదిరించి దోపిడీకి పాల్పడ్డారా? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి విచారణ అనంతరం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

Katedan Firing: Clues Lead to UP Youth

ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఎల్బీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. రాజేంద్రనగర్ బండ్లగూడకు చెందిన మున్నాతో కలసి కాటేదాన్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచి ఎదురుగా ఉన్న జియో సంసార్ సంస్థలో పనిచేస్తున్నారు.

ఎస్‌బీఐకి ఫ్రాంచైజీగా ఉన్న ఈ సంస్థ ఆ బ్యాంకు ఖాతాదారుల నుంచి చిన్న మొత్తాల డిపాజిట్లు, బదిలీలను నిర్వహిస్తోంది. రోజూ సాయంత్రం ఆ లావాదేవీల నగదును బ్యాంకు శాఖకు అప్పగిస్తారు. కాగా, ఈ జియో సంసార్ కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ వ్యక్తి కస్టమర్‌లా వచ్చాడు. అక్కడున్న ప్రసాద్‌తో బిహారీ యాసతో కూడిన హిందీలో మాట్లాడాడు.

రోహిత్‌శర్మ అనే వ్యక్తి ఖాతాలోకి రూ.475 ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. దీంతో ప్రసాద్ పనిలో నిమగ్నమయ్యడు. వెంటనే తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ప్రసాద్ ఛాతీ భాగంలో కాల్చాడు దుండగుడు. ప్రసాద్ తేరుకునేలోపే పరారయ్యాడు. పెద్దగా చప్పుడు కాకపోవడంతో పక్కన ఉన్న దుకాణాల వారికి కూడా ఏం జరిగిందో తెలియలేదు. కొద్ది నిమిషాలకు తేరుకున్న ప్రసాద్.. ఆ భవనంలోని మరో ఏజెన్సీ నిర్వాహకుడి దగ్గరకు వెళ్లాడు.

అతడు వెంటనే బైక్‌పై సమీపంలోని ఓ ఆస్పత్రికి, అక్కడి డాక్టర్ల సలహా మేరకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ ఛాతీ భాగంలో దిగిన తూటా.. పొత్తికడుపులోకి జారిందని వైద్యులు నిర్ధారించారు. ఆ తూటాను వైద్యులు తొలగించారు.

కాగా, జియో సంసార్ కార్యాలయాన్ని పరిశీలించి, సోమవారం నాటి లావాదేవీలకు సంబంధించిన రూ.3.75 లక్షలు భద్రంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు ఆకుపచ్చ రంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు బాధితుడు వెల్లడించాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+