కవిత ఈడీ విచారణ వేళ.. హస్తినలో కవితకు మద్దతుగా పోస్టర్లు, ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు!!

కవిత ఈడీ విచారణ వేళ హస్తినలో కవితకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత నేడు ఈడి విచారణను ఎదుర్కోబోతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు పేర్కొన్న నేపథ్యంలో మరోమారు కవితకు నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు కవితను విచారించడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈరోజు కవిత విచారణలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరోవైపు కవితకు మద్దతుగా కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ కవిత కూడా స్పష్టం చేశారు.

ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ప్రశ్నించాలని భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా కన్ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ చేసే ఆలోచనలో ఉందని సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామచంద్ర పెళ్లై లను మరో మారు విచారించనున్న ఈడీ ప్రధానంగా అరుణ్ పిళ్ళై తో కవిత ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం లో సేకరించిన ఆధారాలను, దర్యాప్తులో తేలిన అనేక వివరాలను ఆధారంగా చేసుకుని కవితను ప్రధానంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో విచారించడానికి ఈడి సిద్ధమైంది.

Kavitha appears before ED today.. Posters in support of Kavitha, BRS leaders in Delhi!!

ఇదిలా ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కవితకు మద్దతుగా దేశ రాజధాని ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. పోరాట యోధుడి బిడ్డ కవిత, ఎప్పుడూ భయపడదు అంటూ పోస్టర్లు వేశారు అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు. బై బై మోడీ అంటూ మోడీ సర్కార్ ను టార్గెట్ చేశారు. దాడులతో కొందరు రాజకీయ నాయకులు మారిపోతారని, బీజేపీ అలా చాలా మందిని మార్చిందని, కానీ కొందరు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటారని, కేసీఆర్ బిడ్డ కవిత దేనికీ భయపడదని ఫోటోలతో హంగామా చేస్తున్నారు. కవితకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు భారీగా సీఎం కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+