కమ్యూనిస్టులకు కవిత కౌంటర్..
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మంలో ఇప్పుడు పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. పాలేరు ఉపఎన్నికతోనైనా మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్న సీపీఎం కి గట్టి బ్రేకులే వేస్తోంది అధికార పక్షం టీఆర్ఎస్. ముఖ్యంగా బుల్లెట్ లాంటి మాటలకు పెట్టింది పేరైన టీఆర్ఎస్ నాయకత్వం పదునైన మాటలతో కమ్యూనిస్ట్ పార్టీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కవిత కమ్యూనిస్టులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విప్లవం రావాలని చెప్పే కమ్యూనిస్టుల కంటే నిజమైన ప్రజా విప్లవాన్ని తీసుకొచ్చిన తన తండ్రి కేసీఆర్ గొప్పవాడన్నారు. కమ్యూనిస్టులు విప్లవం కోసం పోరాడితే వారికంటే మిన్నగా ఉద్యమాన్ని నడిపించి.. తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. ఇంతకుమించిన పోరాట స్ఫూర్తిని ఇంకెవరు ఆచరణలో పెడుతారని ప్నశ్నించిన కవిత.. కేసీఆర్ లాంటి నేతలు సీఎంగా ఉండగా రాష్ట్రానికి కమ్యూనిస్టుల అవసరం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications