ఈడీ ఎదుట హాజరైన కవిత.. పిడికిలి బిగించి అభివాదం; కొనసాగుతున్న విచారణ.. ఢిల్లీలో టెన్షన్!!

ఈడీ ఎదుట హాజరైన కవిత పిడికిలి బిగించి సెల్యూట్ చేసి ఈడీ కార్యాలయంలోకి వెళ్ళారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది.

దేశంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కేంద్రంలోని బిజెపి ఈడీ పేరుతో తమని వ్యతిరేకించే వారిని టార్గెట్ చేస్తున్నారని, కెసిఆర్ పై చేస్తున్న కుట్రలో భాగంగానే కవితకు ఈడి నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ, కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరికలు జారీ చేసిన వేళ నేడు కవిత ఈ డి విచారణకు వెళ్లడం సర్వత్ర ఉత్కంఠ ను రేకెత్తిస్తుంది.

ఈడీ ఆఫీసు వద్ద పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత

ఈడీ ఆఫీసు వద్ద పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత


ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత, ఈడి విచారణను ధైర్యంగా ఫేస్ చేస్తానని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈరోజు ఈడి ముందుకు వెళ్లిన కవిత ఈడి ఆఫీస్ వద్ద అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసం నుండి 10 వాహనాల కాన్వాయ్ లో కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కెసిఆర్ నివాసం నుంచి సరిగ్గా 11 గంటలకు బయలుదేరిన కవిత 11. 08 నిమిషాలకు ఈడి ఆఫీస్ కు చేరుకున్నారు. ఆఫీస్ గేటు దగ్గర నిలబడి అభిమానులకు పిడికిలి బిగించి అభివాదం చేశారు. ఈడీ ఆఫీసు లోపలికి చేరుకున్న తర్వాత కూడా పిడికిలి బిగించి అభివాదం చేసి లోనికి వెళ్లిపోయారు.

కవితతో పాటు మద్దతుగా ఈడీ ఆఫీసుకు వెళ్ళిన భర్త అనిల్,బీఆర్ఎస్ నేతలు

కవితతో పాటు మద్దతుగా ఈడీ ఆఫీసుకు వెళ్ళిన భర్త అనిల్,బీఆర్ఎస్ నేతలు

ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడుతాను అన్న స్ఫూర్తిని తన పిడికిలి బిగించి అభివాదం చేయడం ద్వారా కవిత తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ కవిత ముఖంలో ఈడీని ఎలా ఎదుర్కోవాలి అన్న తాలూకు సంఘర్షణ ప్రస్పుటంగా కనిపించింది. ఇక కవితకు మద్దతుగా ఈడీ ఆఫీస్ గేట్ వరకు కవిత భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ నేతలు, లాయర్లు వచ్చారు. అయితే ఈ డి ఆఫీసు సిబ్బంది వారిని గేటు వద్దనే ఆపివేయడంతో, ఎమ్మెల్సీ కవిత ఒక్కరే లోపలికి వెళ్లారు.

కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు

కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు


ప్రస్తుతం ఈడీ ఆఫీసులో కవితను ఈడి అధికారులు విచారిస్తున్నారు . జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారుల టీమ్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తున్నారు. ఇక కవిత ఈడి విచారణ సమయంలో మంత్రి హరీష్ రావు, కేటీఆర్ న్యాయ నిపుణులతో మంతనాలు జరుపుతున్నారు. నిన్న అర్దరాత్రి వరకు న్యాయ నిపుణులతో మాట్లాడారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఆ తర్వాత పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి. ఏ విధంగా కేంద్రం తీరును ప్రతిఘటించాలి తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

ఈడీ కార్యాలయం వద్ద భద్రత పెంపు.. ఢిల్లీ లో ఉత్కంఠ

ఈడీ కార్యాలయం వద్ద భద్రత పెంపు.. ఢిల్లీ లో ఉత్కంఠ

విచారణకు సహకరించకపోతే కవిత అరెస్టు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న వేళ ఢిల్లీలో ఉత్కంఠ వాతావరణం చోటుచేసుకుంది. ఇప్పటికే భారీగా కవిత అభిమానులు, బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీకి చేరుకున్న తరుణంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఈడీ కేంద్ర కార్యాలయం పరిసరాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+