మహిళా రిజర్వేషన్ బిల్లుపై కదం తొక్కుతున్న కవిత.. మళ్ళీ ఈడీ విచారణ వేళ!!

నేడు కవిత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరీడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఒకపక్క ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కవిత ఏమాత్రం తగ్గేదే లేదంటూ కేంద్రంలోని బీజేపీపై సమర శంఖాన్ని పూరిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

నేడు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న కవిత

నేడు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న కవిత

ఇక తాజాగా నేడు ఢిల్లీకి చేరుకున్న కవిత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరీడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు, పౌర సమాజం పాల్గొననున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అందరినీ ఏకతాటి మీదకు తెచ్చే క్రమంలో కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు.

మహిళా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్లాన్ లో కవిత

మహిళా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్లాన్ లో కవిత


ఇక రేపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరోమారు ఈడి ముందు విచారణకు హాజరుకానున్న కవిత నేడు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని, మహిళా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళనున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. ఇప్పటికే మార్చి 10వ తేదీన పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, రాజకీయాలలో మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత రోజు కవిత ఈడీ విచారణకు హాజరు కావడం ఢిల్లీలో ఉద్రిక్తతకు కారణంగా మారింది.

రేపు మళ్ళీ ఈడీ విచారణకు కవిత.. నేడు మహిళా బిల్లు ఉద్యమం

రేపు మళ్ళీ ఈడీ విచారణకు కవిత.. నేడు మహిళా బిల్లు ఉద్యమం

అయితే ఈడి విచారణను ఎదుర్కొన్న కవిత చిరునవ్వుతో బయటకు వచ్చారు. మళ్లీ రేపు కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే రేపు కూడా కవిత ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొని బయటకు వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. రేపు కవిత ఈడీ విచారణ నేపధ్యంలో రాజకీయ వర్గాలలో ఒకింత ఆసక్తి నెలకొంది. ఏదేమైనా కవిత మాత్రం ఒకపక్క ఈడి విచారణ కొనసాగుతున్నప్పటికీ మరో పక్క పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిడ్డగా పట్టు బిగిస్తున్నారు.

మహిళా బిల్లుకు సంబంధించి సమావేశంలో కవిత ఏం నిర్ణయం తీసుకుంటారు?

మహిళా బిల్లుకు సంబంధించి సమావేశంలో కవిత ఏం నిర్ణయం తీసుకుంటారు?

దేశవ్యాప్తంగా కలిసివచ్చే రాజకీయ పార్టీలన్నీ, మహిళలందరూ తనకు మద్దతుగా నిలవాలని, తనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేయాలని, సాధించేవరకు పోరాటం కొనసాగించే తీరుతామని కవిత తేల్చి చెబుతున్నారు. మరి ఈరోజు జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకుంటారు. ముందు ముందు ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగిస్తారు వంటి అంశాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+