Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి: ‘జై మహారాష్ట్ర’ నినాదమిచ్చిన కవిత, ప్రశంస(పిక్చర్స్)

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో తెలుగువారి సంక్షేమం కోసమే జాగృతి ముంబై శాఖను ప్రారంభించినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా పాలల్లో నీళ్లలాగా కలిసి పోతారని అన్నారు. ముంబైలో భాంద్రాలోని రంగ్ శారదా నాట్యమందిర్‌లో జరిగిన తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ ఆవిర్భావ సభకు కవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డప్పులు, బోనాలు, బతుకమ్మలతో మహారాష్ట్ర జాగృతి మహిళలు స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖను ఆదివారం ముంబైలో ప్రారంభించిన కవిత అక్కడి తెలంగాణ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ మహారాష్ట్రల బంధం తరతరాలదని తెలిపారు.

మహారాష్ట్రలోని తెలుగువారు చాలా చక్కగా మారాఠీ మాట్లాడతారని అన్నారు. ఈ రోజుకి కూడా తెలంగాణలో మరాఠీ పదాలు కనిపిస్తాయన్నారు. కానీ, తెలంగాణ ప్రజలవద్దకు వచ్చిన ఆంధ్రులు తెలంగాణ భాషను అడుగడుగునా అవమానించారన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని చెప్పారు.

తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ తెలంగాణ మహారాష్ట్రల మైత్రీ బంధాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ‘జై తెలంగాణ' ‘జై మహారాష్ట్ర' తమ నినాదమని అన్నారు. ఇన్ని రోజులు ముంబైలో ఉన్న తెలంగాణ ప్రజలకోసం సమైక్య రాష్ట్రంలోని వలస ప్రభుత్వాలు మాట్లాడలేదని ఇవ్వాల ఇక్కడుంది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.

సిద్దివినాయక ఆలయంలో

సిద్దివినాయక ఆలయంలో

ఆదివారం ఉదయం ముంబయిలోని ప్రసిద్ద సిద్దివినాయక ఆలయంలో కవితకు ఘనస్వాగతం లభించింది.

సిద్దివినాయక ఆలయంలో

సిద్దివినాయక ఆలయంలో

ఆలయ ట్రస్టు సభ్యులు ఏక్‌నాథ్ సంగం ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు.

సిద్దివినాయక ఆలయంలో

సిద్దివినాయక ఆలయంలో

ఈ కార్యక్రమానికి అతిథులుగా దక్షిణ ముంబయి పార్లమెంటు సభ్యులు అరవింద్ సావంత్, వర్లీ ఎమ్మెల్యే సునీల్ షిండే, భాంద్రా ఎమ్మెల్యే తృప్తి సావంత్, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్, జాగృతి ప్రదాన కార్యదర్శి నవీన్ ఆచారి, గాయకులు వందేమాతరం శ్రీనివాస్, జాగృతి మహారాష్ట్ర శాఖ అధ్యక్షులు సుల్గే శ్రీనివాస్, తెలంగాణ జాగృతి లండన్ శాఖ అధ్యక్షులు సంపత్‌లు హాజరయ్యారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో తెలుగువారి సంక్షేమం కోసమే జాగృతి ముంబై శాఖను ప్రారంభించినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా పాలల్లో నీళ్లలాగా కలిసి పోతారని అన్నారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

ముంబైలో భాంద్రాలోని రంగ్ శారదా నాట్యమందిర్‌లో జరిగిన తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ ఆవిర్భావ సభకు కవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డప్పులు, బోనాలు, బతుకమ్మలతో మహారాష్ట్ర జాగృతి మహిళలు స్వాగతం పలికారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖను ఆదివారం ముంబైలో ప్రారంభించిన కవిత అక్కడి తెలంగాణ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ మహారాష్ట్రల బంధం తరతరాలదని తెలిపారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలోని తెలుగువారు చాలా చక్కగా మారాఠీ మాట్లాడతారని అన్నారు. ఈ రోజుకి కూడా తెలంగాణలో మరాఠీ పదాలు కనిపిస్తాయన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

కానీ, తెలంగాణ ప్రజలవద్దకు వచ్చిన ఆంధ్రులు తెలంగాణ భాషను అడుగడుగునా అవమానించారన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని చెప్పారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ తెలంగాణ మహారాష్ట్రల మైత్రీ బంధాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

‘జై తెలంగాణ' ‘జై మహారాష్ట్ర' తమ నినాదమని అన్నారు. ఇన్ని రోజులు ముంబైలో ఉన్న తెలంగాణ ప్రజలకోసం సమైక్య రాష్ట్రంలోని వలస ప్రభుత్వాలు మాట్లాడలేదని ఇవ్వాల ఇక్కడుంది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి

జాగృతి పక్షాన మహారాష్ట్ర సమాజంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇక్కడి చరిత్రను, సాహిత్యాన్ని జాగృతి ప్రచురిస్తుందని తెలిపారు. ఈ సారి ముంబైలో బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకోవాలన్నారు.

జాగృతి పక్షాన మహారాష్ట్ర సమాజంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇక్కడి చరిత్రను, సాహిత్యాన్ని జాగృతి ప్రచురిస్తుందని తెలిపారు. ఈ సారి ముంబైలో బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకోవాలన్నారు.

దక్షిణ ముంబయి పార్లమెంటు సభ్యులు అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. తమకు మరాఠీ తల్లి ఐతే తెలుగు చిన్నమ్మ అన్నారు. తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నారు. తమ పార్టీ శివసేన కూడా తెలంగాణ వారి సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేస్తుందని అన్నారు. కవిత పార్లమెంటు‌లో తెలంగాణ వాణి బలంగా వినిపించే నాయకురాలని ప్రశంసించారు. ఇటీవలే హైకోర్టుకోసం పార్లమెంటులో వారం రోజులు నిరసన తెలిపారని అన్నారు.

వర్లీ ఎమ్మెల్యే సునీల్ షిండే మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి తెలుగు వారి మధ్యే పెరిగినా, తెలుగు నేర్చుకోనందుకు తాను ఇప్పటికీ బాధపడతానని అన్నారు. ఖచ్చితంగా సమయం దొరికితే తెలుగు నేర్చుకుంటానని తెలిపారు. ఎక్కువగా తెలుగు వారు ఉండే నియోజకవర్గం వర్లీ అన్నారు.

భాంద్రా ఎమ్మెల్యే తృప్తి సావంత్ మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. బతుకమ్మ లాంటి అందమైన పండుగను తెలుగు వారి నుండి మరాఠీలు పొందారన్నారు. ఈ సారి బతుకమ్మకు తాను వస్తానని కవితకు తెలిపారు.

గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం తన బిడ్దల్ని వెతుక్కుంటూ ముంబయికి, దుబాయికి వచ్చిందన్నారు. తెలంగాణ జాగృతి ముంబయి శాఖకు చాల బాధ్యతలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర మట్టితో తెలంగాణ బిడ్డల అనుబంధం గొప్పదన్నారు. ఇవ్వాళ ఆ చరిత్రంతా వెలికి తీయవలసిన అవసరం ఉందన్నారు.

దాదాపు 2వేలమంది పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి మాహారాష్ట్ర శాఖపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా 1969 ఉద్యమంలో ముంబయిలో ఉద్యమం నడిపిన వారిని కవిత సన్మానించారు. జాగృతి కార్యకర్తలు అధ్యక్షులు కవితను గజమాలతో సన్మానించారు. గాయకులు వందేమాతరం శ్రీనివాస్ పాటలు ఉర్రూతలూగించాయి. గాయకులు సాయిచంద్, బృందం పాటలు శ్రోతల్ని అలరించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+