వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రతో నీటి సమస్య: రంగంలోకి దిగిన కవిత, ఫడ్నవీస్‌తో భేటీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మంజీరా నీటి విషయంపై మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి నిజామాబాద్ పార్లమెటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు.

నిజామాబాదు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి మంగళవారం నాడు ఆమె మహారాష్ట్ర రాజధాని ముంబై వెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఫడ్నవీస్‌కు కల్వకుంట్ల కవిత రెండు వినతి పత్రాలను అందజేశారు. మంజీరా నదికి సంబంధించి సరిహద్దు సమస్యల పరిష్కారానికి జియోగ్రాఫికల్ సర్వే నిర్వహించాలని ఆమె కోరారు. గోదావరి నీళ్లను తెలంగాణకు విడుదలచేయాలని కోరారు.

అదే సమయంలో ఇసుక రవాణా వివాదాల పరిష్కారంపైనా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, తమ ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆమె మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కోరారు.

సింగరేణి లాభాల్లో సిబ్బందికి వాటా: సింగరేణి కార్మిక సంఘం

కార్మికుల కృషివల్లే సింగరేణి సంస్థ పురోభివృద్ధిలో పయనిస్తోందని, సంస్థ లాభాల్లో కార్మిక, ఉద్యోగులకు 25శాతం వాటా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవితకు ఆ సంఘం అధ్యక్షుడు కనకరాజు, ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి మంగళవారం వినతిపత్రం అందజేశారు.

ఫడ్నవీస్ తో కవిత

ఫడ్నవీస్ తో కవిత

మంజీరా నీటి విషయంపై మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి నిజామాబాద్ పార్లమెటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు.

ఫడ్నవీస్ తో కవిత

ఫడ్నవీస్ తో కవిత

నిజామాబాదు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి మంగళవారం నాడు ఆమె మహారాష్ట్ర రాజధాని ముంబై వెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కవిత సంతాపం

కవిత సంతాపం

మాజీ శాసన సభ్యుడు ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి మృతి పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం సంతాపం తెలిపారు.

కవిత సంతాపం

కవిత సంతాపం

మాజీ శాసన సభ్యుడు ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి మృతి పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం సంతాపం తెలిపారు. ఆమె మస్కతి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

English summary
Nizamabad MP K Kavitha appealed to Maharashtra chief minister Devendra Fadnavis to release Godavari waters to Telangana state, which is experiencing adverse seasonal conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X