కవిత లేఖ వెనుక కీలక నేత - నెక్స్ట్ స్టెప్..!?
తెలంగాణ రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ లో కవిత లేఖ ప్రకంపనాలకు కారణమవుతోంది. మై డియర్ డాడీ అంటూ ప్రారంభిస్తూనే.. తాను చెప్పదలచుకున్నది కవిత తేల్చి చెప్పారు. తండ్రికి నేరుగా ఏదైనా చెప్పే అవకాశం ఉన్న కవిత ఇప్పుడు ఈ లేఖ ఎందుకు రాసారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అందులో పాజిటివ్.. నెగటివ్ అంటూ అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే, కవిత లేఖ వెనుక ఒక ముఖ్య నేత ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దీని పైన కేసీఆర్ కోర్ టీంలో కీలక చర్చ జరుగుతోంది.
లేఖ వెనుక
కేసీఆర్ తనయ కవిత రాసిన లేఖ బయటకు వచ్చింది. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు రావటం వెనుక అనేక సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత వరుసగా అనేక సమస్యలు ఎదుర్కొటోంది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ కు కలిసి చర్చించే వెసులుబాటు ఉన్నా.. కవిత లేఖ రాయటం ఏంటనే చర్చ మొదలైంది. దీని ద్వారా కవిత పార్టీలో పరిణామాల పైన పూర్తిగా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కవిత తొలి మూడు పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన చేయగా.. మిగతా నాలుగు పేజీల్లో ప్రతికూల అంశాల ను వివరించారు. ఇందులో ప్రధానంగా బీజేపీతో కేసీఆర్ సంబంధాలు కోరుకుంటున్నట్లు.. దానిని కవిత వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో రాసిన అంశాల ద్వారా బహిర్గతం అవుతోంది.

కవితను నడిపిస్తుందెవరు
కవిత ఇప్పటికిప్పుడు అసలు లేఖ ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది. కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. కవిత తాను రాసిన లేఖ బయటకు ఎందుకు లీక్ చేసారనేది అంతు చిక్కని విషయం గా మారింది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన తరువాత బీజేపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, బీజేపీ తో మాత్రం బీఆర్ఎస్ కవిత అంచనాలకు తగినట్లుగా స్పందించకపోవటం పైన సీరియస్ గా ఉన్నారు. కవిత వెనుక ఒక మాజీ ఎంపీ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ లో ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు ప్రాధాన్యత లేని ఆ నేత ఇప్పుడు కవితను నడిపిస్తున్నారనే చర్చ పార్టీ సీనియర్లలో మొదలైంది. అయితే, కేటీఆర్ మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం అని వ్యాఖ్యానించారు.
విదేశాల నుంచి కవిత
అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న కవిత ఈ రోజు రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. బీజేపీ తో పొత్తు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం తోనే ఈ వివాదం మొదలైనట్లుగా తెలు స్తోంది. ఇదే సమయంలో పార్టీ నాయకత్వం మార్పు అంశం సైతం కారణమని చెబుతున్నారు. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే వాదన ఉంది. హరీష్ సైతం ఇప్పటికే కేటీఆర్ కు పార్టీ పగ్గా లు అప్పగించినా తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు కవిత లేఖ వెనుక కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచనను వ్యతిరేకిస్తున్నారా అనే చర్చ వినినిస్తోంది. కవిత లేఖ పైన కేటీఆర్ - హరీష్ చర్చ చేసారు. కవిత హైదరాబాద్ కు చేరుకున్న తరువాత లేఖ వెనుక తన ఉద్దేశం.. భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications