వెలుగుమట్ల బాధితుల కోసం కవిత మరో షాకింగ్ స్టెప్.. తగ్గేదేలే!
వెలుగు మట్లలో సామాన్య నిరుపేదల పక్షాన కవిత తన పోరాటాన్ని ఆపలేదు. తాజాగా బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేయడానికి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ మేయర్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజిక వేత్తలు, జర్నలిస్టులతో కమిటీ వేసినట్టు కవిత పేర్కొన్నారు.
వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ
బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రొఫెసర్ కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు వెలుగుమట్ల లో జరిగిన ఘటన పైన స్పందించాలన్నారు కవిత. నిజ నిర్ధారణ కమిటీని వెలుగుమట్లలో ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహరించిందో అక్కడకు వెళ్లి పరిశీలించాలన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి పేదవారికి న్యాయం జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.

వాళ్ళ మనుగడ బాధ్యత ప్రభుత్వానిదే
తాము ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నానన్నారు. బాధితుల ఇళ్లు పూర్తయ్యే వరకు వాళ్ల మనుగడకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వెలుగుమట్లలో ఎటువంటి నోటీసులు, హెచ్చరిక లేకుండా పేదలకు సంబంధించిన 750 ఇళ్ళను కూల్చేసిందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజాపోరాటాలకు గెలుపు ఉంటుంది
ధర్మసమాజ్ పార్టీ, జాగృతి ఈ అన్యాయం పై చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కూల్చిన చోటే 350 మందికి పట్టాలు ఇస్తామని, మరో 110 మందికి వాళ్ల గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అన్నారు కవిత. ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాపోరాటాలకు గెలుపు ఉంటుందని భావిస్తున్నామన్నారు. అయితే 750 మంది ఇళ్లను కూల్చేసి, 460 మందికి మాత్రమే ఇళ్లను ఇస్తామంటున్నారు.
సంపూర్ణ న్యాయం జరిగేవరకు పోరాటం
ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ప్రజాపోరాటాలకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ సంపూర్ణ న్యాయం జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేసిన కవిత డిసెంబర్ 9 నాటికి వాళ్ల ఇళ్లను పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ అప్పటివరకు ఆ పేదలు ఎక్కడ ఉండాలి? అని ప్రశ్నించారు. వాళ్ల ఇంటి అద్దె, పిల్లల చదువుకు కావాల్సిన సాయం ప్రభుత్వమే చేయాలన్నారు.
మేధావుల మౌనం సమాజానికి నష్టం
మేధావుల మౌనం సమాజానికి ఎంతో నష్టం చేస్తుందన్నారు. దయచేసి కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు స్పందించాలన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు కవిత. ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీని వాస్తవాలను తెలుసుకునేందుకు ఖమ్మం పంపించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు













Click it and Unblock the Notifications