ఎంజీఎంలో దూది ఉంటే సూది లేదు, వరద సాయం ఇదేనా: నిలదీసిన కవిత
వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం చేయలేదని, వరంగల్లో 150 ఇళ్లు కొట్టుకుపోతే నయా పైసా సాయం అందలేదని తెలంగాణ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు. ఇక వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో పరిస్థితి సూది ఉంటే దూది లేదని, బేసిక్ మందులు కూడా లేవని, పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

కవిత జనం బాట పాదయాత్ర
వరంగల్, హన్మకొండ జిల్లాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా కవిత వరంగల్ లోని సమ్మయ్య నగర్ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో వరదలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. 15 రోజుల క్రితం సీఎం ఇక్కడికి వచ్చి ప్రజలకు చాలా హామీలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.

ప్రకృతి విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు
సీఎం మాట అంటే అది జీవోతో సమానమని ఆయనే అన్నాడు. మరి సీఎం మాట ఎందుకు అమలు కాలేదని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నానన్నారు. ఇది పకృతి విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు అన్నారు. వరంగల్, హన్మకొండలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన కవిత ఎంజీఎం హాస్పిటల్ లో వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అన్నారు.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూది ఉంటే దూది లేదు
తెలంగాణ వచ్చాక ఈ హాస్పిటల్ సరిపోదని కొత్తది కట్టుకోవాలనుకున్నాం. వరంగల్ జైలు స్థలాన్ని తీసుకొని 20ఫ్లోర్లతో నిర్మించతలపెట్టిన హాస్పిటల్ ఆగిపోయిందన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూది ఉంటే దూది లేదు. దూది ఉంటే సూది లేదన్నట్లుగా ఉంది పరిస్థితి అన్నారు. ఉచితంగా అందించే బేసిక్ మందులు కూడా లేవన్నారు. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు, ముగ్గురు మంత్రులున్న ఫలితం లేదని, ఎంజీఎంలో టెస్టులు చేసేందుకు కావాల్సిన కెమికల్స్ కూడా లేవన్నారు.

రాజకీయాలు అప్పుడు చేసుకుందాం
ఇలా ఎవరు చేసినా తప్పేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరిదైనా అది తప్పే అన్నారు. ఎన్నికలు ఉన్న చివరి ఏడాది రాజకీయాలు చేసుకుందామని అప్పటివరకు పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ మూడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ గెలిచి రెండేళ్లు అయ్యింది. బీఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరాక ఇప్పుడు తీరకపోతే ఏంటీ పరిస్థితి? అని ప్రశ్నించారు. తాను ఇప్పుడు ఓట్ల కోసం రాలేదని, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని వచ్చానని అన్నారు.
పరిష్కారమైన సమస్యలపై యాక్షన్ టేకెేన్ రిపోర్ట్ విడుదల చేస్తాం
జనం బాట కు సంబంధించి 5 జిల్లాలకు కలిపి యాక్షన్ టేకెేన్ రిపోర్ట్ విడుదల చేస్తాం అన్నారు. 5 జిల్లాల్లో మా దృష్టికి వచ్చిన సమస్యలు వాటిలో పరిష్కారమైనవి 5 జిల్లాల వారీగా రిపోర్ట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. తాను పిల్లల్ని వదిలేసి టైంపాస్ కోసం పర్యటన చేయడం లేదన్నారు. తన పర్యటనలతో ప్రజల సమస్యలు పరిష్కారమైతే ప్రజలకు పైసా మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్టేనని కవిత పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications