మునుగోడులో కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టే.. సూపర్ లాజిక్ చెప్పారుగా!!
మునుగోడు ఉపఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల పర్వం పూర్తి కానుండటంతో ప్రచార పర్వాన్ని హోరెత్తించాలని టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడు లో మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల పోరులో కేసీఆర్ ఓటమి అంగీకరించినట్టే
ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల పోరులో కెసిఆర్ ఓడిపోయారని, ఆయన ఓటమి పరోక్షంగా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. మునుగోడు ఉప ఎన్నికల పోరులో కెసిఆర్ ఓటమిపై ఆసక్తికర లాజిక్ చెప్పిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎనిమిది సంవత్సరాలుగా ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి మొత్తం 88 మందిని పంపించడం ద్వారా పరోక్షంగా ఓటమిని అంగీకరించారని తేల్చి చెప్పారు.

మంత్రులు,ఎమ్మెల్యేలు అంతా మునుగోడుపై పడ్డారు
మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన రాష్ట్రాన్ని గాలికి వదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మునుగోడుపై పడడం కెసిఆర్ ఓటమిని అంగీకరించాడు అని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఏరోజూ ఫామ్ హౌస్ ను వదిలి బయటకు రాని సీఎం కేసీఆర్, నేడు మునుగోడు ఉప ఎన్నిక కోసం ఒక ఎంపీటీసీ పరిధిని ఎంచుకొని ప్రచారం చేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఊరికి ఒక మంత్రి, ఊరికొక ఎమ్మెల్యేను దింపి ఎన్నికల ప్రచారాన్ని చేస్తుండడం కెసిఆర్ భయాన్ని సూచిస్తుందని, ఓటమికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఇక ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ కుమార్తె కవిత పై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తీవ్ర విమర్శలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కెసిఆర్ బంధువు అభిషేక రావు అరెస్ట్ అయిన తర్వాత, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారని తెలిసే కాపాడుకోవడం కోసం కేంద్రంతో మంతనాలు జరపడానికి సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలలో బీఎస్పీ ఎన్నికల బరిలో ఉండడంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుగోడులో తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు లో అధికార పార్టీ తీరు, ఓటమిని అంగీకరించింది అని చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది అన్నారు.












Click it and Unblock the Notifications